![King Charles III Parliament Speech: Pledges Follow Selfless Duty - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/13/King_Charles_3_Parliament.jpg.webp?itok=_eHQBBe5)
లండన్: బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్–3 పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం.
ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్‌లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు.
అస్తమయం చెందిన రాణి ఎలిజబెత్–2కు ఎంపీలు సహా దాదాపు 900 మంది ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు, రాణి పార్థివదేహాన్ని మంగళవారం స్కాట్లాండ్ నుంచి లండన్‌కు వాయు మార్గంలో తీసుకురానున్నారు.
ఇదీ చదవండి: చనిపోయే ముందు వాళ్లకు రాణి గ్రీటింగ్స్!!
Comments
Please login to add a commentAdd a comment