
యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద రిషి సునాక్ ప్రసంగించారు. అంతకు ముందు లిజ్ ట్రస్.. కింగ్ ఛార్లెస్‌ను కలిసి ప్రధాని పదవికి(ఆపద్ధర్మ) తన రాజీనామాను సమర్పించారు.
ప్రధానిగా తనకు మద్దతు ఉందని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రిషి సునాక్, కింగ్ ఛార్లెస్-3ని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిషిని కింగ్ ఛార్లెస్ ఆహ్వానించారు. దీంతో రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా నియమిస్తున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు.
ప్రధానిగా ట్రస్ తన వంతు ప్రయత్నం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తా. బ్రిటన్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టకుంటా. సంక్షోభం నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. మనం అద్భుతాలు సాధించగలం అంటూ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment