ప్లీజ్‌.. ఒక్కసారి కలవాలి: కింగ్‌ ఛార్లెస్‌కు మేఘన్‌ లేఖ | Meghan Markle Requests King Charles For Meeting | Sakshi
Sakshi News home page

రాణి పోయింది.. రాజకుటుంబ కలహాల పుల్‌స్టాప్‌కు ఇదే రైట్‌ టైం!

Published Wed, Sep 21 2022 8:06 AM | Last Updated on Wed, Sep 21 2022 8:59 AM

Meghan Markle Requests King Charles For Meeting - Sakshi

కోడలు మేఘన్‌తో కింగ్‌ ఛార్లెస్‌-3 (పాత ఫొటోలు)

లండన్‌: క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్‌ ఆఫ్‌ సస్సెక్స్‌ మేఘన్‌ మార్కెల్‌ ఎపిసోడ్‌ కూడా హైలైట్‌ అయ్యింది. క్వీన్‌ ఎలిజబెత్‌-2 రెండో మనవడు ప్రిన్స్‌ హ్యారీ తన భార్య మేఘన్‌తో కలసి రాయల్‌ డ్యూటీస్‌కు దూరంగా కాలిఫోర్నియాలో స్థిరపడిన విషయం తెలిసిందే. 

అయితే.. రాణి-మేఘన్‌కు, ప్రిన్స్‌ సోదరుడు విలియం భార్య క్యాథరిన్‌ ఎలిజబెత్‌ మిడిల్‌టన్‌-మేఘన్‌కు మధ్య గిట్టని పరిస్థితుల్లోనే ప్రిన్స్‌హ్యారీ రాజహోదాకు దూరమైనట్లు ఒక ప్రచారం ఉంది. అంతేకాదు.. బ్రిటన్‌ను వీడాక.. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో తమకు ఎదురైన పరిస్థితులపై సంచలన ఆరోపణలే చేశారు ఆ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో.. 

క్వీన్‌ అంత్యక్రియలకు మేఘన్‌ దూరంగా ఉంటుందని, అసలు రాజకుటుంబం ఆమెను ఆహ్వానించకపోవచ్చని అంతా భావించారు. అయితే ఆ అంచనాలు తలకిందులు చేస్తూ.. మేఘన్‌ మార్కెల్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకు హాజరైంది కూడా. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ కలహాలకు పుల్‌స్టాప్‌ పడాలని మేఘన్‌ భావిస్తోంది. అందుకే ఆమె బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3(ప్రిన్స్‌ హ్యారీ తండ్రి)ని ప్రైవేట్‌గా కలిసి చర్చించాలని ఓ లేఖ రాసింది. 

కాలిఫోర్నియాకు వెళ్లే ముందు.. రాజకుటుంబానికి చెందిన కీలక విషయాలు చర్చించాల్సి ఉందని కింగ్‌ ఛార్లెస్‌-3 అపాయింట్‌మెంట్‌ కోరుతూ ఆమె రాజప్రసాదానికి అభ్యర్థన లేఖ రాసిందని, ఇది అభినందించదగ్గ సాహసోపేత నిర్ణయమంటూ రాజకుటుంబ వ్యవహరాల విశ్లేషకుడు నెయిల్‌ సీన్‌ తన యూట్యూబ్‌లో ఓ వీడియో అప్‌లోడ్‌ చేశాడు. రాజకుటుంబంలోని పొరపచ్చాల్ని తొలగించుకునేందుకు ఇదే మంచి సందర్భమని ఆమె అనుకుంటున్నట్లు అక్కడి మీడియా విశ్లేషిస్తోంది.

ఇదిలా ఉంటే.. క్వీన్‌ ఎలిజబెత్‌-2తో పాటు ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేథరిన్‌ మిడెల్‌టన్‌(ప్రిన్స్‌ విలియం భార్య)పై మేఘన్‌ ఆరోపణలు గుప్పించింది గతంలో. కానీ, కింగ్‌ ఛార్లెస్‌తో పాటు ఆయన సతీమణి క్యామిల్లాకు, మేఘన్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ తనను ఒక కూతురిలా భావిస్తారని తరచూ మేఘన్‌ చెప్తుండేవారు. అంతెందుకు రాజప్రసాదంపై విమర్శల తర్వాత.. కొడుకుకొడలిని మన్నిస్తానని కింగ్‌ ఛార్లెస్‌ ఒక ఇంటర్వ్యూలో సైతం తెలిపారు కూడా. ఈ తరుణంలో.. తమ మధ్య చర్చల ద్వారా కుటుంబ కలహాలకు చెక్‌ పెట్టాలని మేఘన్‌ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇదీ చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement