హాట్‌టాపిక్‌గా ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్క్లే గౌను! | Meghan Markles Windsor Gown Sparks Fresh UK Royal Family Debate, More Details Inside | Sakshi
Sakshi News home page

హాట్‌టాపిక్‌గా ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్క్లే గౌను!

Published Sun, May 12 2024 5:36 PM | Last Updated on Sun, May 12 2024 7:03 PM

Meghan Markles Windsor Gown Sparks Fresh UK Royal Family

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III చిన​ కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.  ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్‌ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్‌టాపిక్‌గా మారింది. రీజన్‌ ఏంటంటే..

డచెస్ ఆఫ్ సస్సెక్స్‌గా పేరుగాంచిన మేఘన్‌ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్‌ హెడీ మెరిక్‌ చేత డిజైన్‌ చేయించుకుంది. డిజైనర్‌ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్‌ గౌన్‌ బ్లష్‌. విండర్స్‌ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్‌ మార్క్లే ప్రిన్స్‌ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్‌ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 

రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోని విండ్సర్‌ ఎస్టేట్‌లో నివశించేవారు. గతేడాది జూన్‌లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్‌ చార్లెస్‌ మేఘన్‌కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్‌ యోగా టీచర్‌! 50 ఏళ్ల వయసులో..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement