దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల్లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీని ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. సామాజిక కార్యక్రమల పట్ల నీతాకు ఉన్న అచంచలమైన నిబద్ధత తోపాటు సమాజంపై సానుకూత ప్రభావం చూపేలా ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. నీతా చేసిన అశేష దాతృత్వ సేవలు, జాతీయ-అంతర్జాతీయ పరంగా ఆమెకు విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈవో జూలియా మోర్లీ చేతుల మీదుగా నీతా అంబానీ ఈ మిస్ వరల్డ్ ఫౌండేషన్ హ్యుమానిటేరియన్ అవార్డుని అందుకుంది. ఆమె ఒక గృహిణిగా, సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా ఎన్నో విజయాలు సాధించింది. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. ఆమె నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాగా, మిస్ వరల్డ్–2024 పోటీల్లో కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్‌కోవా దక్కించుకున్నారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇక భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు.
(చదవండి: 'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు;! దటీజ్ నీతా)
Comments
Please login to add a commentAdd a comment