ఇటీవల అమ్మమ్మలు, అమ్మలు ధరించిన పెళ్లినాటి చీరలను సరికొత్తగా డిజైన్ చేయించుకుని ధరించడం ట్రెండ్‌గా మారింది. సరిగ్గా చెప్పాలంటే రెట్రో ఫ్యాషన్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల పెళ్లి నాటి చీరలు, ఒకప్పుడు ధరించిన ఫ్యాషన్ వేర్‌లను కాస్త మార్పులు చేసి.. సరికొత్తగా కనిపించేలా ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోకి ప్రిన్సెస్ అన్నే కూడా చేరిపోయారు.
రాజ కుటుంబానికి చెందిన అన్నే ఈ ఫ్యాషన్‌కి మద్దతివ్వడం అందరిని విస్మయపరిచింది. ఇటీవల బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఖతారీ రాజకుటుంబానికి ఇచ్చిన ఆతిథ్యంలో తన తన అన్న ప్రిన్స్ చార్లెస్ IIIతో కలిసి అన్నే కూడా భాగమయ్యారు. ఆ ఆతిథ్యంలో అన్నే 40 ఏళ్ల నాటి క్రీమ్ గౌనుతో ఆకట్టుకుంది. ఆమె ధరించి డిజైనర్‌వేర్ చూస్తే ఇటీవలే డిజైన్ చేసినట్లుగా చూడముచ్చటగా కనిపిస్తుంది.
కానీ ఇది నలభైఏళ్ల నాటిది. ఈ గౌనులో 1985 నాటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. మళ్లీ ఇన్నేళ్లకు ధరించినా.. ఆమె ఒంటికి చక్కగా సరిపోవడమే గాక అలనాటి అందాల అన్నేని జ్ఞప్తికి తెచ్చింది. ఆ డిజైనర్‌వేర్‌కి తగ్గట్టుగా డైమండ్‌తో పొదగిన ఆక్వామెరైన్ పైన్‌ఫ్లవర్ కిరీటం రాయల్టీని తెలియజేస్తుంది. ఈ కిరీటాని అన్నేకి దివగంత అమ్మమ్మ బహుమతిగా ఇచ్చారు.
దుస్తులు కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న తరుణంలో అందరిని ఆకర్షించే విధంగా..ఓ ఉద్యమంలా తీసుకొచ్చిన ఈ రెట్రో ఫ్యాషన్‌లో రాజకుటుంబికులు కూడా తమ వంతుగా భాగస్వామ్యం కావడం విశేషం. ఓ సామాన్యురాలి వలే ఏళ్ల నాటి డిజైనర్ గౌనుతో కనిపించి.. రాజదర్పానికి అసలైన అర్థం ఇచ్చి.. అందరిచేత ప్రశంసలందుకుంది.
(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక)
Comments
Please login to add a commentAdd a comment