Cream
-
40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!
ఇటీవల అమ్మమ్మలు, అమ్మలు ధరించిన పెళ్లినాటి చీరలను సరికొత్తగా డిజైన్ చేయించుకుని ధరించడం ట్రెండ్‌గా మారింది. సరిగ్గా చెప్పాలంటే రెట్రో ఫ్యాషన్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల పెళ్లి నాటి చీరలు, ఒకప్పుడు ధరించిన ఫ్యాషన్ వేర్లను కాస్త మార్పులు చేసి.. సరికొత్తగా కనిపించేలా ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోకి ప్రిన్సెస్ అన్నే కూడా చేరిపోయారు. రాజ కుటుంబానికి చెందిన అన్నే ఈ ఫ్యాషన్‌కి మద్దతివ్వడం అందరిని విస్మయపరిచింది. ఇటీవల బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఖతారీ రాజకుటుంబానికి ఇచ్చిన ఆతిథ్యంలో తన తన అన్న ప్రిన్స్ చార్లెస్ IIIతో కలిసి అన్నే కూడా భాగమయ్యారు. ఆ ఆతిథ్యంలో అన్నే 40 ఏళ్ల నాటి క్రీమ్ గౌనుతో ఆకట్టుకుంది. ఆమె ధరించి డిజైనర్‌వేర్ చూస్తే ఇటీవలే డిజైన్ చేసినట్లుగా చూడముచ్చటగా కనిపిస్తుంది. కానీ ఇది నలభైఏళ్ల నాటిది. ఈ గౌనులో 1985 నాటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. మళ్లీ ఇన్నేళ్లకు ధరించినా.. ఆమె ఒంటికి చక్కగా సరిపోవడమే గాక అలనాటి అందాల అన్నేని జ్ఞప్తికి తెచ్చింది. ఆ డిజైనర్‌వేర్‌కి తగ్గట్టుగా డైమండ్‌తో పొదగిన ఆక్వామెరైన్ పైన్ఫ్లవర్ కిరీటం రాయల్టీని తెలియజేస్తుంది. ఈ కిరీటాని అన్నేకి దివగంత అమ్మమ్మ బహుమతిగా ఇచ్చారు. దుస్తులు కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న తరుణంలో అందరిని ఆకర్షించే విధంగా..ఓ ఉద్యమంలా తీసుకొచ్చిన ఈ రెట్రో ఫ్యాషన్‌లో రాజకుటుంబికులు కూడా తమ వంతుగా భాగస్వామ్యం కావడం విశేషం. ఓ సామాన్యురాలి వలే ఏళ్ల నాటి డిజైనర్ గౌనుతో కనిపించి.. రాజదర్పానికి అసలైన అర్థం ఇచ్చి.. అందరిచేత ప్రశంసలందుకుంది.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
శీతకాలంలో వేదించే పొడిచర్మ సమస్యకు ఇది బెస్ట్ క్రీమ్!
శీతకాలంలో చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంటుంది. కాళ్లు, చేతులు కూడా శీతకాలంలో పొడిబారినట్లు అయిపోయి పగళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్లో లభించే ఎన్ని రకాల క్రీమ్‌లు రాసినా అంత ప్రయోజనం ఉండదు. దీనికి బెస్ట్ క్రీం ఆయుర్వేదంలో ఉంది. ఐదేవేల ఏళ్ల నాటి చరక సంహితలో ఆ క్రీమ్ గురించి సవివరంగా చెప్పారు. దీన్ని మంచి మాయిశ్చరైజింగ్ క్రీం అనే చెప్పాలి. ఇంతకీ ఏంటా క్రీమ్ అంటే.. దీని పేరు 'శత ధౌత ఘృత క్రీమ్'. ఏంటీ పేరు ఇలా ఉందనిపిస్తుందా?..ఆ పేరులో క్రీమ్ అంటే ఏంటో చెబుతుంది. శత అంటే వంద. ధౌత అంటే కడగడం. ఘృత అంటే నెయ్యిం. మొత్తం కలిపితే వందసార్లు కడిగిన నెయ్యి అని అర్థం. నెయ్యిని వందసార్లు కడగడం ఏంటీ?. ఇదేంక్రీం అని ముఖం చిట్లించకండి. ఇది చర్మ సౌందర్యానికి అద్భుతమైన క్రీమ్ అని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికే కాకుండా వృధ్యాప్య ఛాయలను కూడా తగ్గించి మంచి నిగారింపునిస్తుంది ఈ క్రీమ్. ఎందుకు నెయ్యిని ఇలా వందసార్లు కడగాలంటే..నేరుగా నెయ్యిని ముఖానికి అప్లై చేస్తే దానిలో ఉండే పీహెచ్ చర్మానికి అనుకూలంగా ఉండదు. అదే నెయ్యిని వందసార్లు నీటితో కడగితే దానిలో ఉండే పీహెచ్ స్థాయిలు తటస్థంగా మారిపోతాయి. అప్పుడూ ముఖానికి అప్లై చేస్తే చర్మంలోని లోతైన పొరల్లోకి చొచ్చుకుని పోయి మృతకణాలకు లేకుండా చేస్తుంది. పైగా ముఖం అత్యంత కోమలంగా ఉంటుంది. అంతేగాదు ఇది ఇరిటేషన్, సోరియస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాల బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ఐతే కొంచెం శ్రమతో కూడిన పని. ఈ క్రీం తయారీ కోసం మీకు కావల్సిందల్లా మంచి ఆవునెయ్యి, స్వచ్ఛమైన నీరు. నీటితో ఇలా వందసార్లు నెయ్యిని కడగటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ఈ సహజసిద్ధమైన క్రీమ్‌ని తయారు చేసుకుని మీ మేనుని కాంతివంతంగా మార్చుకోండి!. అంతేకాదండోయ్! మార్కెట్లో కూడా లభిస్తుంది. (చదవండి: కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్‌పెట్టండి!) -
టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే
టీవీ చూస్తూ చాలా పనులు చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది దర్జాగా రిమోట్ తిప్పుతూ టీవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏ సిరీయల్లో చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అలాగే కూరగాయలు కట్ చేస్తూనో, పిల్లలకు అన్నం తినిపిస్తూనో టీవీ షోలను చూస్తూ ఉంటారు. పరధ్యానంగా టీలో పంచదారకు బదులు ఉప్పు వేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదేమో కానీ ఒక్కోసారి ఊహించని సమస్యకి దారి తీస్తుంది. మహిళ టీవీ చూస్తూ ఒకటి చేయబోయి.. ఇంకోటి చేసి ఆ తరువాత ఇబ్బందులు పడింది. పరధ్యానానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన తరువాత ఇపుడు మనమంతా కాస్త జాగ్రత్త పడాల్సిన వార్త ఇది. అసలు విషయం ఏమిటంటే..డైలీ స్టార్ కథనం ప్రకారం మియా కిట్టిల్సన్ అనే మహిళకి బెక్ హమ్(Beckham) డాక్యు సిరీస్ అంటే పిచ్చి. దీనిపై బాయ్ ఫ్రెండ్‌తో చర్చిస్తుంది కూడా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా పెయిన్ కిల్లర్ క్రీమ్ డీప్ హీట్ క్రీమ్ వాడేసింది. ఇంకేముందు నోటిలో చురుక్కున మండడంతో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. ఘాటైన వాసనతో ఇబ్బంది పడింది. దీంత విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు. తన షాకింగ్ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. అది కోల్గేట్ టూత్పేస్ట్లానే ఉంది అంటూ నొప్పి నివారణ క్రీమును వాడిన వైనాన్ని వివరించింది. దీంతో నెటిజను కమెంట్ల వర్షం కురిపించారు. టిక్‌టాక్‌లో కిట్టెల్సన్ వీడియోకు వచ్చిన వ్యూస్ 10 లక్షలకు పై మాటే అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏమేరకు వైరల్ అయిందో. ఇది ఇలా ఉంటే గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ కోల్డ్ సోర్ క్రీం బదులుగా పెదాలకు సూపర్‌గ్లూను రాసేసుకుంది. తెలుసుగా గ్లూ రాసుకుంటే ఏమవుతుందో.. పెదాలకు అతుక్కుపోయి నానా బాధలు పడింది. విపరీతమైన జలుబుతో బాధపడింది. చివరికి వైద్యులు పారాఫిన్ ఆయిల్‌తో ఆమె పెదవుల సీల్‌ను విప్పారు. సో.. తస్మాత్ జాగ్రత్త! -
షుగర్ పేషెంట్లకు భారీ ఊరట: మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్ జెల్
Magnetic gel చర్మంపై ఏర్పడే తీవ్రమైన పుండ్ల చికిత్సలో కీలక అధ్యయనం ఒకటి భారీ ఊరటనిస్తోంది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలు, ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు,డయాబెటిక్, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్ కెరాటినోసైట్లు , ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. (గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!) "వైర్లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్ కెరాటినోసైట్లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్ డివైస్ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. (‘‘ఇక్కడ క్లిక్ చేయండి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
ఐస్‌క్రీమ్ పార్లర్లో అందాల భామలు
-
టూత్‌పేస్ట్, సన్క్రీమ్లతో డయాబెటిస్ రిస్క్!
అధిక బరువుకు దారితీసే ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి వల్ల, జన్యు కారణాల వల్ల డయాబెటిస్ వస్తుందని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, టూత్‌పేస్ట్‌ల వల్ల, మేకప్ కోసం వాడే సన్క్రీమ్ వంటి పదార్థాల వల్ల కూడా టైప్–2 డయాబెటిస్‌కు లోనయ్యే ముప్పు ఉంటుందని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టూత్పేస్ట్లు, సన్క్రీమ్లు తదితర పదార్థాల్లో తెల్లని తెలుపు రంగు కోసం వాడే ‘టిటానియమ్ డయాక్సైడ్’ అనే రసాయనం డయాబెటిస్ ముప్పును కలిగిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు వెల్లడించారు. టిటానియమ్ డయాక్సైడ్ను ప్లాస్టిక్, పెయింట్లు సహా రకరకాల గృహోపకరణ వస్తువుల తయారీలో వాడటం ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల నుంచి ప్రారంభమైంది. దీని వాడుక 1960 దశకం నుంచి విపరీతంగా పెరిగింది. టిటానియమ్ డయాక్సైడ్ కేవలం ఆహార పానీయాల ద్వారా మాత్రమే కాదు, శ్వాసక్రియ ద్వారా కూడా మనుషుల శరీరాల్లోకి చేరుతుందని, రక్తంలో కలిసిన టిటానియమ్ డయాక్సైడ్ కణాలు పాంక్రియాస్‌ను దెబ్బతీస్తాయని టెక్సాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న వారిలో టైప్–2 డయాబెటిస్ రోగుల పాంక్రియాస్లో టిటానియమ్ డయాక్సైడ్ కణాలను గుర్తించామని, డయాబెటిస్ లేని వారి పాంక్రియాస్లో ఆ రసాయనిక కణాలేవీ లేవని వారు వివరించారు. టిటానియమ్ డయాక్సైడ్ను పేపర్ తయారీలోను, కొన్ని రకాల ఔషధ మాత్రల తయారీలోను, ఫుడ్ కలర్స్ తయారీలో కూడా వాడుతున్నారని, దీని వాడకం పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి, ఇప్పుడిది మహమ్మారి స్థాయికి చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిటానియమ్ డయాక్సైడ్ ప్రభావం వల్ల పాంక్రియాస్ పాడైనవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి క్షీణించడం వల్ల వారు టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారని టెక్సాస్ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆడమ్ హెల్లర్ తెలిపారు. ఆస్బెస్టాస్ ఊపిరితిత్తుల వ్యాధిని కలిగించే రీతిలోనే టిటానియమ్ డయాక్సైడ్ డయాబెటిస్‌కు కారణమవుతోందని తమ పరిశోధనలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించాల్సి ఉందని, తాము ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని డాక్టర్ హెల్లర్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను ‘కెమికల్ రీసెర్చ్ ఇన్ టాక్సికాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. -
పెదవులు గులాబీ రంగు
బ్యూటిప్స్ పెదవులు పగిలి బాధ పెడుతుంటే... నేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే వారం తిరిగేసరికల్లా సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. -
పొడి చర్మానికి హనీ ప్యాక్
బ్యూటిప్స్ చర్మాన్ని పొడిబారకుండా కాపాడడంలో మొదటి స్థానం తేనెదే. తేనె కలిపిన ప్యాక్ వేసుకుంటే ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కీరదోస ముక్కలు, ఒక టేబుల్ స్పూను కమలాపండు రసం, ఒక స్ట్రాబెర్రీ, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ మీగడ కాని పెరుగు కాని తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మిక్సీలో బ్లెండ్ చేసు కోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరకాయ, కమలారసం, స్ట్రాబెర్రీ చర్మానికి తాజాదనాన్నిస్తాయి. తేనె, పెరుగు మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. బంతిపువ్వు రెక్కలు(ఒక పువ్వు), ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూను పాలు కాని మీగడ కాని తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. వారానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే వాడాలి. బంతిపూలు దొరకని రోజుల్లో సెలెండ్యులా క్రీమ్ వాడవచ్చు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. -
ఇదిగిదిగో... క్రీమ్!
ప్రసిద్ధ ‘సోనీ వరల్డ్స్ ఫొటోగ్రఫీ’ అవార్డ్‌ల కోసం జరిగిన వడపోతలో మిగిలిన కొన్ని ఫొటోల్లో ఇవి కూడా కొన్ని. వీటిని ‘క్రీమ్' అని పిలుస్తున్నారు. 171 దేశాల నుంచి వేలాది ఎంట్రీలు ఈ పోటీకి వచ్చాయి. మానవ ఆసక్తికి సంబంధించిన ్గఫొటోలతో పాటు ప్రకృతి, భౌగోళిక అందం, సామాజిక న్యాయం...ఇలా వివిధ విభాగాలకు చెందిన ఫొటోలు ఇందులో ఉన్నాయి. నలుపు తెలుపుల్లో పంచరంగుల అందం... బంగ్లాదేశ్‌లో మహ్మద్ అద్నాన్ తీసిన మొదటి ఫొటో చూసి ‘వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే’ అని పిల్లల గురించి మాత్రమే పాడుకోనక్కర్లేదు. ఆ ఆనంద గీతాన్ని పెద్దల దగ్గరికీ తీసుకువెళ్లవచ్చు. టర్కీ ఫొటోగ్రాఫర్ కెన్డిస్లిగో తీసిన ఫొటోలో... వానను ప్రేమించే వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె వానోత్సవాన్ని కొలవడానికి ఏ పరికరాలూ చాలవేమో! పేదరికపు సంపన్న దృశ్యం... ఒకటి: ఓపెన్ ట్రావెల్ కేటగిరిలో ఎంపికైన ఈ ఫొటోను చెన్నై బీచ్‌లో ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ చెవెసోవ తీశారు. అడుక్కునే అమ్మాయి చేతిలో కోతి అందరిని ఆకట్ట్టుకుంటోంది. జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే దాని ముందు బేలగా ‘కోతి’ అనే ఉపాధితో నిల్చుంది అమ్మాయి. ‘‘ఈ అమ్మాయి విధిరాతతో నాకేమిటి సంబంధం? నాకు ఎందుకు స్చేచ్ఛ లేదు’’ అని కోతిగారు లోకాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో. రెండు: పశ్చిమబెంగాల్లో నబద్విప్ ప్రాంతంలో వెనిజులా ఫొటోగ్రాఫర్ మహదేవ్ రోజాస్ టొర్రెస్ తీసిన ఫొటోలో ఇటుకలు తయారు చేసే కార్మికుల ‘పేదరికం’ పిల్లల రూపంలో కనిపిస్తుంది. ఈ పిల్లలు ఏదో ఆలోచిస్తున్నారా? ఈ సమాజాన్ని ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా?! -
నాణ్యతకే ప్రాధాన్యమివ్వండి
తెరపైనా, తెరవెనుక ఎంతో అందంగా, సంప్రదాయబద్ధంగా, ముద్దుముద్దుగా, అల్లరిగా, సొగసుగా ఉండే బాలీవుడ్ అందాలసుందరి అలియాభట్... నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపాలని యువతకు సలహాలిస్తోంది. ‘కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యతకే మొగ్గుచూపాలి. బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులు నాణ్యత కలిగిఉంటాయి. నాణ్యత విషయంలో ఎవరుకూడా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించి లేదా మేకప్‌కు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి’ అని హితవు పలికింది. తాను వినియోగించే వ స్తువులు లేదా ఉత్పత్తుల విషయంలో అలియా అత్యంత జాగ్రత్త వహిస్తుంది. తన వెంట ఉండే బ్యాగ్‌లో అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగించే ఉత్పత్తులు కనీసం ఐదు లేదా ఆరింటిని ఉంచుకుంటుంది. మేబిలైన్ బేబీ లిప్స్లిప్ బామ్, పెర్ఫ్యూమ్, క్రీమ్, కోహల్, మై హెయిర్ బ్రష్‌లను నిరంతరం ఈ అందాల భామ అందుబాటులో ఉంచుకుంటుంది. గూగుల్ హ్యాంగవుట్ద్వారా గత నెల 21వ తేదీన ఈ ముద్దుగుమ్మ ఆన్లైన్లో అనేకమందికి బ్యూటీ టిప్‌లు చెప్పింది. సందేశాలు పంపింది. అంతేకాకుండా వీడియో చాటింగ్కూడా చేసింది. గార్నియర్ ఫ్రుక్టిస్ అనే హెయిర్‌కేర్ ఉత్పత్తుల సంస్థకు అలియా... బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీంతోపాటు ఎంటీవీ డిజిటల్ షో ‘ఫిలిప్స్ ఎంటీవీ ది లుక్’ అనే కార్యక్రమంద్వారా కేశసంరక్షణ గురించి ప్రేక్షకులకు సలహాలు, సూచనలు అందిస్తోంది. కేశాలను కాపాడుకోవడం ద్వారా అందంగా ఎలా కనిపించగలుగుతామనే విషయాన్ని చక్కగా వివరిస్తోంది.