శీతకాలంలో చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంటుంది. కాళ్లు, చేతులు కూడా శీతకాలంలో పొడిబారినట్లు అయిపోయి పగళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్లో లభించే ఎన్ని రకాల క్రీమ్‌లు రాసినా అంత ప్రయోజనం ఉండదు. దీనికి బెస్ట్ క్రీం ఆయుర్వేదంలో ఉంది. ఐదేవేల ఏళ్ల నాటి చరక సంహితలో ఆ క్రీమ్ గురించి సవివరంగా చెప్పారు. దీన్ని మంచి మాయిశ్చరైజింగ్ క్రీం అనే చెప్పాలి. ఇంతకీ ఏంటా క్రీమ్ అంటే..
దీని పేరు 'శత ధౌత ఘృత క్రీమ్'. ఏంటీ పేరు ఇలా ఉందనిపిస్తుందా?..ఆ పేరులో క్రీమ్ అంటే ఏంటో చెబుతుంది. శత అంటే వంద. ధౌత అంటే కడగడం. ఘృత అంటే నెయ్యిం. మొత్తం కలిపితే వందసార్లు కడిగిన నెయ్యి అని అర్థం. నెయ్యిని వందసార్లు కడగడం ఏంటీ?. ఇదేంక్రీం అని ముఖం చిట్లించకండి. ఇది చర్మ సౌందర్యానికి అద్భుతమైన క్రీమ్ అని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికే కాకుండా వృధ్యాప్య ఛాయలను కూడా తగ్గించి మంచి నిగారింపునిస్తుంది ఈ క్రీమ్. ఎందుకు నెయ్యిని ఇలా వందసార్లు కడగాలంటే..నేరుగా నెయ్యిని ముఖానికి అప్లై చేస్తే దానిలో ఉండే పీహెచ్ చర్మానికి అనుకూలంగా ఉండదు.
అదే నెయ్యిని వందసార్లు నీటితో కడగితే దానిలో ఉండే పీహెచ్ స్థాయిలు తటస్థంగా మారిపోతాయి. అప్పుడూ ముఖానికి అప్లై చేస్తే చర్మంలోని లోతైన పొరల్లోకి చొచ్చుకుని పోయి మృతకణాలకు లేకుండా చేస్తుంది. పైగా ముఖం అత్యంత కోమలంగా ఉంటుంది. అంతేగాదు ఇది ఇరిటేషన్, సోరియస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాల బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ఐతే కొంచెం శ్రమతో కూడిన పని. ఈ క్రీం తయారీ కోసం మీకు కావల్సిందల్లా మంచి ఆవునెయ్యి, స్వచ్ఛమైన నీరు. నీటితో ఇలా వందసార్లు నెయ్యిని కడగటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ఈ సహజసిద్ధమైన క్రీమ్‌ని తయారు చేసుకుని మీ మేనుని కాంతివంతంగా మార్చుకోండి!. అంతేకాదండోయ్! మార్కెట్లో కూడా లభిస్తుంది.
(చదవండి: కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్‌పెట్టండి!)
Comments
Please login to add a commentAdd a comment