
ప్రతిష్టాత్మక మెట్ గాలా 2024
మెరిసిన హైదరాబాదీ బిజినెస్ వుమెన్ సుధారెడ్డి
ప్రతిష్టాత్మక మెట్ గాలా 2024లో భారతీయ బిలియనీర్ సుధారెడ్డి అత్యంత విలువైన ‘అమోర్ ఎటర్నో’డైమండ్ నెక్లెస్ ధరించి తళుక్కు మన్నారు. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమి టెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి మెట్ గాలా 2024లో రెడ్‌కార్పెట్‌ను అలంకరించారు. ఈ వేదికగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతమైన దుస్తులతోపాటు 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌తో పాల్గొని అందరి చూపులను తన వైపు తిప్పుకున్నారు.
ఈ నెక్లెస్, ఇతర అందమైన ఆభరణాల తయారీకి 100 గంటలు పట్టిందట. ముఖ్యంగా ఇందులో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా ప్రధాన భాగంలో నాలుగు పెద్ద, గుండె ఆకారంలో వజరాలను పొదిగారు. సింబాలిక్‌గా కుటుంబ వృక్షం కూడా ఉంది. అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త కృష్ణనుకు ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల హార్ట్‌షేప్డ్ వజ్రంతో, సుధా రెడ్డిని సూచిస్తూ, ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్ , ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు 20-క్యారెట్ డైమండ్స్ కుమారులు ప్రణవ్,మానస్‌లను ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు.

ఇంకా 23 క్యారెట్ల యెల్లో డైమండ్ రింగ్, రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్ ఇలా అన్ని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

ఈసందర్బంగా సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment