వాషింగ్టన్: తమ భూభాగంలో ప్రతి అంగుళా న్ని కాపాడుకొనేందుకు ‘నాటో’ సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. ఒకవేళ రష్యా దాడికి దిగితే నాటో తగు రీతిలో స్పందిస్తుందన్నారు. రష్యాతో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, ఉక్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించారు. నాటో అనేది ఒక రక్షణ కూటమి అని గుర్తుచేశారు.
శుక్రవారం బ్రస్సెల్స్‌లో నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో బ్లింకెన్ పాల్గొన్నారు. 30 సభ్యదేశాల రక్షణ బాధ్యత తమపై ఉందని నాటో అధినేత జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలో నాటో భాగస్వామి కాదని స్పష్టం చేశారు.
(చదవండి: శత్రువుని సైలెంట్‌గా లేపేసే అస్త్రం!.)
Comments
Please login to add a commentAdd a comment