టిఫిన్ ఒకచోట, భోజనం మరోచోట..బస వేరే చోట | police had taken unusual measures for the security of John Kerry and Ban Ki-moon | Sakshi
Sakshi News home page

టిఫిన్ ఒకచోట, భోజనం మరోచోట..బస వేరే చోట

Published Wed, Jan 14 2015 2:24 PM | Last Updated on Sat, Aug 25 2018 3:29 PM

టిఫిన్ ఒకచోట, భోజనం మరోచోట..బస వేరే చోట - Sakshi

టిఫిన్ ఒకచోట, భోజనం మరోచోట..బస వేరే చోట

అహ్మదాబాద్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, యూఎన్ కార్యదర్శి బాన్ కీ మూన్ ల గుజరాత్ పర్యటనలో అసాధారణ భద్రతా చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా కెర్రీ, మూన్ల బస  అహ్మదాబాద్ నగరంలో మూడు హోటళ్లలో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు.

 

జాన్ కెర్రీ రాక గురించి హోటల్ వారికి కూడా చివరి నిమిషం దాకా ఎలాంటి సమాచారం ఇవ్వబోమని చెప్పారు. జాన్ కెర్రీ ఉదయం టిఫిన్ ఒక హోటల్లో, మధ్యాహ్న భోజనం మరో చోట, రాత్రి బస చేసేందుకు మరో  హోటల్ బుక్ చేసినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు. యూఎన్ కార్యదర్శి బాన్ కీ మూన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement