కలసి కృషి చేద్దాం: ఒబామా
వాతావరణ ఒప్పందంపై మోదీకి ఫోన్
వాషింగ్టన్/పారిస్: అంతర్జాతీయ వాతావరణ ఒప్పందంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి మాట్లాడారు. సమర్థవంతమైన ఒప్పందం దిశగా కృషి చేద్దామని వారు నిర్ణయించారు. పారిస్ ఐరాస్ వాతావరణ సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ భేటీ అయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే మోదీకి ఒబామా ఫోన్ చేశారు. ఈ వివరాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వంద బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు ప్రక్రియ పురోగతి సాధించిందంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఇచ్చిన నివేదికను బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా తప్పుబట్టాయి.