వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్ లూథర్ పావెల్ (84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు పావెల్ కుటుంబం సోమవారం ప్రకటించింది. అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. పావెల్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కూడా వెల్లడించింది. ఈ సందర్బంగా ఆయనకు చికిత్సఅందించిన వైద్య సిబ్బందికి ఫేస్‌బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.
కాగా రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన పావెల్ టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2000లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో తొలి ఆఫ్రికన్-అమెరికన్ విదేశాంగ కార్యదర్శిగా ఘనతను సాధించారు. బుష్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2001-2005 వరకు బుష్ క్యాబినెట్‌లో పనిచేసిన పావెల్ సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో కీలక భూమికను నిర్వహించారు. అయితే ఇరాక్ యుద్ధం సందర్భంగా పావెల్ తీవ్ర విమర్శలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment