సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ | John Kerry to stay overnight at Geneva hospital after bike accident | Sakshi
Sakshi News home page

సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ

Published Mon, Jun 1 2015 4:29 AM | Last Updated on Sat, Aug 25 2018 3:29 PM

సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ - Sakshi

సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ

జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు.  కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత  ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ సరిహద్దుకు ఆగ్నేయంగా 40 కి.మీ. దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని స్కింజైర్ సమీపంలో సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

పారామెడికల్ సిబ్బంది, ఒక వైద్యుడు ఆ సమయంలో కెర్రీతో పాటు ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆదేశ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు కెర్రీ జెనీవా వెళ్లారు. ప్రమాదం కారణంగా మిగిలిన నాలుగు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement