Bicycle riding
-
ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!
కొత్తకొత్త ఆవిష్కరణలను ఆవిష్కరించి ఔరా! అనిపించుకుంటారు కొంతమంది. ఎవరు చేయని సాహసకృత్యాలు చేసిన వార్తల్లోకి ఎక్కుతారు. ఇక్కడొక వ్యక్తి అందరూ నడిపే మాములు సైకిల్ని అతి పొడవైన సైకిల్‌గా రూపొందించి రైడ్ చేయాలనుకున్నాడు. అతని ఆలోచనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సలో స్థానం దక్కేలా చేసింది. అసలు విషయంలోకెళ్తే.. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి అతి పొడవైన సైకిల్ని రూపోందించాడు. ఈ సైకిల్‌ను రీసైకిలింగ్ వస్తువులతో రూపొందిచడటం విశేషం. పైగా అతనికి ఈ సైకిల్ తయారు చేయడానికి దాదాపు ఒక నెల పట్టింది. సైకిల్ పనితీరు కోసం ఇంకొన్ని వారాలు పట్టిందని ఆడమ్ తెలిపారు. ఈ మేరకు ఆడమ్ మాట్లాడుతూ.. ‘తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అని చెబుతున్నాడు. అయితే ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగుళాలు ఉంటుందట. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ బుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడమ్ అతి పొడవైన సైకిల్ని రైడింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆడమ్‌ని గొప్ప ఆవిష్కర్త అంటూ నెటిజన్ల ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఇదేందయ్యా ఇది నేను చూడలా.. ‘ఫన్నీ’ స్నానం వీడియో వైరల్) -
లాక్డౌన్: 350 కి.మీ సైకిల్ ప్రయాణం, కానీ..
భోపాల్: లాక్డౌన్ విధింపుతో వలస కార్మికుల జీవనం దుర్భరమైపోయింది. తినేందుకు తిండి లేక, సొంతూరికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ధైర్యం చేసి కాలినడకన తమ ఊళ్లకు బయల్దేరితే, మరికొందరు సైకిళ్లపై వెళ్తున్నారు. ఈక్రమంలో ప్రమాదాల బారినపడి కొందరు, వందల కిలోమీటర్ల ప్రయాణం కావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో పనిచేసే కొందరు వలస కార్మికులు రెండు రోజుల క్రితం సొంతూరు మధ్య ప్రదేశ్‌లోని మహరాజ్ గంజ్‌కు సైకిళ్లపై పయనమయ్యారు. అయితే, 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్‌లోని బర్వానీకి చేరుకున్న అనంతరం అస్వస్థతకు గురైన తబరక్ అన్సారీ (50) అనే వ్యక్తి సైకిల్‌పై నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన శనివారం ఉదయం జరగింది. అన్సారీ తీవ్ర అలసటకు గురవడంతో, గుండెపోటు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అన్ని అంశాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా, బర్వానీ జిల్లాలో గత పది రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోదని స్థానికులు చెప్తున్నారు. (చదవండి: పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం) భివాండీలోని పవర్ లూమ్ యూనిట్లో పనిచేసే తమకు లాక్డౌన్ విధించడంతో ఉపాధి కరువైందని అన్సారీతోపాటు ప్రయాణం చేసిన మరో కార్మికుడు వాపోయాడు. తమ యూనిట్ యజమాని ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, తిండిలేక అల్లాడిపోయామని, అందుకనే ఏదేమైనా ఇంటికి వెళ్లాలని బయల్దేరామని చెప్పాడు. ఇక కరోనా విజృంభిస్తుండటంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. (చదవండి: 17దాకా లాక్డౌన్.. సడలింపులివే..!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సైకిల్’తో అమెరికాకు!
కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అన్న ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని అందిపుచ్చుకున్నాడు ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే అతడి ఆలోచన విద్యుత్, పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే ఆటోమేటిక్ చార్జి సైకిల్ రూపకల్పనకు దోహదం చేసింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే సైకిల్ తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. బోస్టన్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు తన ప్రతిభను ప్రదర్శించేందుకు అమెరికా పయనమయ్యాడు. అతడే తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి నాగశ్రీపవన్. కృష్ణా జిల్లా/ తోట్లవల్లూరు: తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి రమేష్‌బాబు, నాగవెంకట హనుమలత దంపతుల కుమారుడు కంభంపాటి నాగశ్రీపవన్. కంచికచర్ల సమీపంలోని దేవినేని వెంకటరమణ, హిమశేఖర్ మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నాడు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో పేదలు, సామాన్యుల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించే ఆటోమేటిక్ చార్జి సైకిల్‌ను రూపొందించాడు. కళాశాల మెకానికల్ యాజమాన్యం, అధ్యాపక బృందం, ఏపీ స్కిల్ డవలప్మెంట్ సహకారంతో సైకిల్‌ను రూపొందించినట్లు నాగశ్రీపవన్ తెలియజేశాడు. అమెరికా పయనం.. ఏపీ స్కిల్ డవలప్మెంట్ ద్వారా నాగశ్రీపవన్‌కు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అతను రూపొందించిన ఆటోమేటిక్ చార్జి సైకిల్ గురించి వివరించటానికి ఈ నెల 4 నుంచి 16వ తేదీ మధ్యలో సైకిల్‌తో సహా రావాలని యూనివర్సిటీ కోరింది. దీంతో పవన్ శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధువుల వీడ్కోలు నడుమ అమెరికా పయనమయ్యాడు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఓ ప్రత్యేక పరికరం తయారు చేయటం, దానిని ప్రదర్శించేందుకు అమెరికా వెళుతుండటంపై గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల సైకిల్ రైతులు, పేదల కోసం ఏదో ఒకటి రూపొందించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఆటోమేటిక్ చార్జి సైకిల్. దీని తయారీకి రూ.20 వేల వరకు వ్యయమవుతుంది. గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పెట్రోల్, డీజిల్, విద్యుత్ అవసరం లేదు. సైకిల్ నడుస్తుండగానే చార్జి అవుతూ ప్రయాణిస్తుంది. 150 కేజీల వరకు బరువు మోయగలిగే సామర్థ్యంతో దీనిని మరింత అధునాతంగా రూపకల్పన చేసేందుకు కృషి చేస్తున్నాను. సైకిల్ రూపకల్పనకు సహకరించిన మిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్‌బాబు, మెకానికల్ హెచ్‌వోడీ, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. –కంభంపాటి నాగశ్రీపవన్, ఇంజినీరింగ్ విద్యార్థి, తోట్లవల్లూరు -
సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ
జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ సరిహద్దుకు ఆగ్నేయంగా 40 కి.మీ. దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని స్కింజైర్ సమీపంలో సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పారామెడికల్ సిబ్బంది, ఒక వైద్యుడు ఆ సమయంలో కెర్రీతో పాటు ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆదేశ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు కెర్రీ జెనీవా వెళ్లారు. ప్రమాదం కారణంగా మిగిలిన నాలుగు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. -
లవ్ జర్నీ
హనీమూన్ కోసం 15 దేశాల్లో సైకిల్ సవారీ దేవరపల్లి చేరుకున్న ఫ్రాన్స్ దంపతులు ‘ప్రేమయాత్రలకు కొడెకైనాలు..కాశ్మీరాలు ఏలనో’.. అంటూ గుండమ్మకథలో ఏఎన్నార్, జమున ఆడిపాడిన యుగళగీతం తెలుగు శ్రోతల మదిలో ఎప్పటికీ మార్మోగుతుంటుంది. ఆ కథానాయికలు హనీమూన్ వద్దనుకున్నా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఓ చిన్నది, ఓ చిన్నోడు అలా అనుకోలేదు. వారి ‘ప్రేమ దేశాలు’ దాటి ప్రయాణిస్తోంది. విశ్వవ్యాప్తమై పరిమళిస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లయ్యాక హనీమూన్‌ను వినూత్నంగా జరుపుకోవాలనుకున్నారు. ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరిన వీళ్లిద్దరూ ఎన్నో దేశాల్లో తిరిగి ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. మంగళవారం దేవరపల్లి చేరుకున్న మాధ్యూ, మేలిస్ అబాడై దంపతులు స్థానిక బసంతి హోటల్లో విలేకరులకు అందించిన ఆసక్తికరమైన విశేషాలు వారి మాటల్లో.. 2014 జూలై 12న మాధ్యూ, మేలిస్ అబాడై వివాహం జరిగింది. జూలై 27న ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరారు. పదిహేను దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు 10 దేశాల్లో పర్యటించి 11వ దేశమైన భారతదేశం చేరుకున్నారు. ఈ ఏడాది జూలై 25 నాటికి యాత్ర పూర్తి చేసుకొని స్వదేశానికి వెళ్తారు. రోజుకు వంద కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు. ఇందుకు రోజుకు సుమారు రూ.1,000 ఖర్చవుతోంది. యాత్ర ముగిసేటప్పటికి మొత్తం రూ.4 లక్షలు ఖర్చవుతుంది. సైకిల్ ఖరీదు రూ.60 వేలు జర్మనీలో తయారైన సైకిల్‌ను రూ.60 వేలకు కొనుగోలు చేసి 15 దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆర్మేనియా నుంచి సైకిల్‌ను విమానంలో ముంబయికి తీసుకొచ్చారు. ముంబయి నుంచి సైకిల్‌పై కన్యాకుమారి, చెన్నై, శ్రీలంక వెళ్లారు. అక్కడినుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఇప్పటి వరకు థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, షార్జా, గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని దంపతులు తెలిపారు. ఫ్రాన్స్, యూరప్ దేశాల్లో వరి పంట ఉండదన్నారు. ఇక్కడి వ్యవసాయానికి, ఫ్రాన్స్ వ్యవసాయానికి తేడా ఉందన్నారు. జూన్ 27 నాటికి కోలకత్తా చేరుకొని యాత్రను ముగిస్తామని, అక్కడి నుంచి విమానంలో ఫ్రాన్స్ వెళ్తామని మాధ్యూ తెలిపారు. న్యాయవాదిగా పనిచేస్తున్న మేలిస్ అబాడైను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆయన తెలిపారు. దంపతులకు జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కైరం అప్పారావు వీడ్కోలు పలికారు. - దేవరపల్లి -
చెన్నై టు మాయాపూర్ సైకిల్ సవారీ
సింగరాయకొండ:శ్రీకృష్ణునిపై ఉన్న భక్తితో చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చైతన్యమహాప్రభు జన్మస్థలమైన మాయాపూర్ దేవాలయానికి సైకిల్ యాత్ర చేపట్టాడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన కైను. ఆస్ట్రేలియా నుంచి చెన్నై వరకు విమానంలో వ చ్చి అక్కడి నుంచి సైకిల్‌పై ప్రయాణం సాగిస్తున్నాడు. మార్గమధ్యంలో ఇస్కాన్ దేవాలయాల్లో బసచేస్తూ 18 రోజుల్లో గమ్యానికి చేరుకుంటానని కైను ‘సాక్షి’కి తెలిపాడు. గత ఏడాది నేపాల్ దేశంలోని ఖాట్మండ్ నుంచి శ్రీకృష్ణుని జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని బృందావనానికి సైకిల్‌పై వెళ్లానని చెప్పాడు. మార్గమధ్యంలో స్వయంగా వంట చేసుకుని తింటానన్నాడు. శ్రీకృష్ణుని మీద ఉన్న భక్తి తనను ఎంత దూరం అయినా ప్రయాణించేలా చేస్తోందని వివరించాడు.