బీజింగ్: దాదాపు ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా నిఘా భారీ బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అమెరికా వాయుసేన కూల్చేయడం వంటి ఘటనలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే.
‘‘ఇటీవల బాలీలో బైడెన్‌తో కుదిరిన ‘కనీస అవగాహన’కు కొనసాగింపుగా చైనా తన వైఖరిని స్పష్టంచేసింది. ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించాయి. పరస్పర గౌరవం, నమ్మకాల మీదనే చర్చలు సఫలమవుతాయి’’ అని భేటీ తర్వాత జిన్‌పింగ్ వ్యాఖ్యానించారని చైనా అధికార వార్తాసంస్థ సీజీటీఎన్. ‘ బ్లింకెన్ పర్యటనతో ఇరుదేశాల బంధం కీలక కూడలికి చేరుకుంది. అయితే చైనాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ చెప్పారు. చైనాతో దౌత్య ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉండాలనే లక్ష్యంతో∙బ్లింకెన్ పర్యటన సాగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment