న్యూఢిల్లీ: జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు విక్రమ్ మిశ్రి (59) విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. క్వాట్రాను అమెరికాలో భారత రాయబారిగా నియమించొచ్చని సమాచారం. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌కు చెందిన మిశ్రి నియామకం జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ రూపంలో ఏకంగా ముగ్గురు ప్రధానులకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అరుదైన రికార్డు మిశ్రి సొంతం. చైనాతో సంబంధాలు దిగజారిన వేళ ఆ దేశ వ్యవహారాల నిపుణుడిగా పేరున్న మిశ్రి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019–21 మధ్య ఆయన చైనాలో భారత రాయబారిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment