Vikram Misri
-
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
విదేశాంగ కార్యదర్శిగా విక్రం మిశ్రి నియామకం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు విక్రమ్ మిశ్రి (59) విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. క్వాట్రాను అమెరికాలో భారత రాయబారిగా నియమించొచ్చని సమాచారం. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్కు చెందిన మిశ్రి నియామకం జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ రూపంలో ఏకంగా ముగ్గురు ప్రధానులకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అరుదైన రికార్డు మిశ్రి సొంతం. చైనాతో సంబంధాలు దిగజారిన వేళ ఆ దేశ వ్యవహారాల నిపుణుడిగా పేరున్న మిశ్రి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019–21 మధ్య ఆయన చైనాలో భారత రాయబారిగా పని చేశారు. -
చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
బీజింగ్: కోవిడ్–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్ఝౌ నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్ఎన్ఏ కిట్లను భారత్కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది. అయితే, చైనా తయారీ వైద్య పరికరాల నాణ్యతపై వస్తున్న అనుమానాలపై చైనా ప్రభుత్వం స్పందించింది. వీటిని ప్రముఖ సంస్థలు తయారు చేస్తున్నందున నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయా దేశాలకు హామీ ఇచ్చింది. -
మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సింగ్లా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విక్రమ్ మిస్రీ- స్పెయిన్ లో భారత రాయబారిగా నియమితులయ్యారు. వీరి నియామకాలకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేసింది. 1997 బ్యాచ్ కు చెందిన సింగ్లా- ఇజ్రాయిల్ లోని భారత దౌత్య కార్యాలయంలో పని చేసిన ఇక్కడకు వచ్చారు. అంతకుముందు విదేశాంగ మాజీ కార్యదర్శి రంజన్ మతాయ్ వద్ద డైరెక్టర్ గా పనిచేశారు.