న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విక్రమ్ మిస్రీ- స్పెయిన్ లో భారత రాయబారిగా నియమితులయ్యారు. వీరి నియామకాలకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేసింది.
1997 బ్యాచ్ కు చెందిన సింగ్లా- ఇజ్రాయిల్ లోని భారత దౌత్య కార్యాలయంలో పని చేసిన ఇక్కడకు వచ్చారు. అంతకుముందు విదేశాంగ మాజీ కార్యదర్శి రంజన్ మతాయ్ వద్ద డైరెక్టర్ గా పనిచేశారు.
మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సింగ్లా
Published Sun, Jul 20 2014 8:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM
Advertisement
Advertisement