బీజింగ్: కోవిడ్–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్‌ఝౌ నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్‌ఎన్‌ఏ కిట్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది. అయితే, చైనా తయారీ వైద్య పరికరాల నాణ్యతపై వస్తున్న అనుమానాలపై చైనా ప్రభుత్వం స్పందించింది. వీటిని ప్రముఖ సంస్థలు తయారు చేస్తున్నందున నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయా దేశాలకు హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment