national secretary
-
కావాలంటే బయట మార్పుకోసం ఎంతయినా శ్రమిద్దాం! మనలో మార్పంటే అసాధ్యం కామ్రేడ్!
-
విదేశాంగ కార్యదర్శిగా విక్రం మిశ్రి నియామకం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు విక్రమ్ మిశ్రి (59) విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. క్వాట్రాను అమెరికాలో భారత రాయబారిగా నియమించొచ్చని సమాచారం. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌కు చెందిన మిశ్రి నియామకం జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ రూపంలో ఏకంగా ముగ్గురు ప్రధానులకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అరుదైన రికార్డు మిశ్రి సొంతం. చైనాతో సంబంధాలు దిగజారిన వేళ ఆ దేశ వ్యవహారాల నిపుణుడిగా పేరున్న మిశ్రి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019–21 మధ్య ఆయన చైనాలో భారత రాయబారిగా పని చేశారు. -
‘‘వాషింగ్ మెషిన్’’ కామెంట్స్.. ఎంపీపై బీజేపీ చర్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పడేసిన ఎంపీపై బీజేపీ చర్యలు తీసుకుంది. జాతీయ కార్యదర్శి పదవి నుంచి అనుపమ్ హజ్రాను తప్పిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పార్టీ పేరు, ప్రతిష్టలను దెబ్బ తీసే యత్నం చేయడమే ఇందుకు కారణంగా వెల్లడించింది. అనుపమ్ హజ్రా 2014 ఎన్నికల్లో బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్ తరఫున నెగ్గారు. కానీ, ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. బెంగాల్లో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించడంలో బీజేపీకి అనుపమ్ ముఖచిత్రంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2020లో బీజేపీ ఆయనకు జాతీయ కార్యదర్శి పోస్ట్ కట్టబెట్టి జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. అవినీతి నేతలు ఎవరున్నా సరే.. బీజేపీలో చేరేందుకు తనను సంప్రదించాలంటూ బహిరంగ ప్రకటన చేశారు. ‘‘బీజేపీలో చేరాలని అనుకుంటున్నారా?. ఈడీ, సీబీఐ నోటీసులు అందుతాయని.. దాడులు జరుగుతాయని భయంగా ఉందా?.. మీకు ఎంతటి అవినీతి చరిత్ర ఉన్నా సరే.. ఫేస్బుక్ ద్వారా నన్ను సంప్రదించొచ్చు. మొహమాటంగా అనిపిస్తే.. నేరుగా నన్ను వచ్చి కలిసి మాట్లాడొచ్చు. బీజేపీ మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలో అనే ఆలోచన తప్పకుండా చేస్తుంది’’ అంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ అయ్యింది. ఇక ప్రతిపక్షలు ఈ వీడియో ఆధారంగా చెలరేగిపోయాయి. బీజేపీ అవినీతిపరులకు అడ్డాగా మారుతుందా? అంటూ మండిపడ్డాయి. అనుపమ్ ‘‘వాషింగ్ మెషిన్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఇంతకాలం సైలెంట్‌గా ఉంది. అయితే టీఎంసీ ఈ ఆరోపణలపై ఇంకా విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు చర్యలు తీసుకుంది. పార్టీ గీత దాటినందుకే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేరు మీద ప్రకటన విడుదలైంది. పార్టీ అగ్రనేత, చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా కోల్‌కతా పర్యటన సమయంలోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. -
ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, కశ్మీర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి , జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎదరు దెబ్బ తగిలింది. దేశ భద్రతకుముప్పు అంటూ ముప్తీ పాస్‌పోర్టును రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఫ్తీ ట్విట్ చేశారు. 2019 ఆగస్టు (స్పెషల్ స్టేటస్ రద్దు)తరువాత రాష్ట్రంలో నెలకొన్న సాధారణ పరిస్థితికి ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పాస్‌పోర్ట్ ఇవ్వడం ఇంత పెద్ద దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఎలా అవుతుందంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు. (మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కార్యాలయం తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు. తన పాస్‌పోర్ట్ గతేడాది మే 31 తో ముగిసిందని, తదనుగుణంగా 2020 డిసెంబర్ 11 న తాజా పాస్‌పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్‌పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఈడీ నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు జారీకి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో ముఫ్తీని ఈడీ విచారిస్తోంది. జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది.జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేస నమోదు చేసింది. కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనతరం, మెహబూబాతోపాటు ఇతర నేతలను కేంద్రం దాదాపు సంవత్సరంపాటు నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. Passport Office refused to issue my passport based on CID’s report citing it as ‘detrimental to the security of India. This is the level of normalcy achieved in Kashmir since Aug 2019 that an ex Chief Minister holding a passport is a threat to the sovereignty of a mighty nation. pic.twitter.com/3Z2CfDgmJy — Mehbooba Mufti (@MehboobaMufti) March 29, 2021 -
రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్లో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలైన ఆర్బీఐ, సీబీఐలాంటి సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర, బెంగాల్లో ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయన్నారు. ఈ నెల 19న పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. -
ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా లెనిన్‌బాబు
కర్నూలు సిటీ: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా ఎన్.లెనిన్‌బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, రంగన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాముడు, కారుమంచి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4,5,6 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో లెనిన్‌ను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. -
ఏచూరికే చాన్స్!
సీపీఎం నూతన సారథిగా దాదాపు ఖరారు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కొత్త రథసారథి (ప్రధాన కార్యదర్శి)గా సీతారాం ఏచూరి పేరు దాదాపు ఖరారైంది. శనివారం విశాఖలో జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశంలో ఏచూరి కూడా పాల్గొనడం ఆయన నియామకానికి మరింత ఊతమిచ్చినట్లయింది. ఏదైనా అత్యంత కీలక పరిణామం జరిగితే పేరు మారవచ్చని, లేదంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆదివారం మధ్యాహ్నానికి ఏచూరి పేరును అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ అత్యున్నత పదవికి ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ 50 ఏళ్ల చరిత్రలో ఇంత గట్టి పోటీ జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కూడా నూతన సారథిపై తన మనసులో మాట బయటపెట్టలేదు. శనివారంనాటి పరిణామాలు, సీనియర్ నేత అచ్యుతానందన్ ఏచూరికి శుభాకాంక్షలు తెలపడం, ఏచూరి పొలిట్ బ్యూరోలో పాల్గొనడం వంటి ఘటనలు ఆయన ప్రధాన కార్యదర్శి అవుతారన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై కూడా దీనిపై నోరు విప్పలేదు. ‘సీతారాం ఏచూరికి అచ్యుతానందన్ శుభాకాంక్షలు చెప్పారు. మీకు చెప్పారా?’ అని విలేకరులు పిళ్లైని అడగ్గా.. ‘‘ఏచూరికి ఏమి చెప్పారో నాకు తెలియదు, నాకైతే చెప్పలేదు’’ అని అసహనం వెలిబుచ్చారు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. పొలిట్ బ్యూరో సమావేశమై కేంద్ర కమిటీ కూర్పుపై ముసాయిదాను రూపొందిస్తుందని, దానిని ప్రస్తుత కేంద్ర కమిటీ ముందుంచుతుందని చెప్పారు. ఇది కూడా ప్రతిపాదన మాత్రమేనని, మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారని అన్నారు. విశాఖలో నేడు సీపీఎం బహిరంగ సభ సీపీఎం 21వ జాతీయ మహాసభల చివరిరోజైన ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఇక్కడి ఆర్కే బీచ్‌లో కాళీమాత ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా. బహిరంగసభకు పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభలో పార్టీ ప్రముఖులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, సీతారాం ఏచూరి, బృందాకారత్‌తోపాటు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు ప్రసంగిస్తారు. సభకు ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మహా ప్రజాప్రదర్శన ప్రారంభమవుతుంది.