న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే ఉదంతాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించడానికి భారత్ అంగీకరించలేదు. ఈ విషయంపై ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయని విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు.న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానిపై వీసా మోసం, తప్పుడు సమాచారం కింద అమెరికా ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడింది. అయితే దీన్ని ముగిసిన అధ్యాయంగా అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?అన్న ప్రశ్నకు సుజాతా సింగ్ పై విధంగా బదులిచ్చారు. ఆ అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదని సుజాతా సింగ్ తెలిపారు.