పటాన్‌చెరు టౌన్: కట్నం, బైక్ ముందే కావాలని, ఇస్తేగాని పెళ్లి చేసుకునేది లేదని ఓ యువకుడు ఫోన్‌లో యువతిని తిడుతూ అడగటంతో మనస్తాపం చెందిన యువతి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యయు యత్నించింది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు పట్టణంలోని నాయికోటి బస్తీకి చెందిన జంగయ్య కూతురు యామినికి పటాన్‌చెరు మండలం భానూర్ కంచర్లగూడెంకు చెందిన జంగయ్య అక్క లక్ష్మి కుమారుడు చిన్నోల శంకర్‌తో మార్చి 26వ తేదీన నిశ్చితార్థం జరిగింది.
ఆ సమయంలో రూ.50 లక్షలు కట్నం భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పడంతో శంకర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం జరిగిన మార్నాడే కట్నంతో పాటు బైక్ ముందే కావాలని యువతికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అడిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు వెళ్లడంతో తనకు పెళ్లి అవసరం లేదంటూనిశ్చితార్థం సమయంలో పెట్టిన రింగ్ తీసి పడేశాడు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుదామని చెప్పి ఇంటికి వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి భవనం రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే యామినిని చికిత్స కోసం పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మిషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కట్నకానుకల విషయంలో శంకర్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంవల్లే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment