
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా మద్దూరు మండలం లాడ్నూరు గ్రామంలో కామాంధులు రెచ్చిపోయారు. 23 ఏళ్ల మూగ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఓ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిన కొందరు యువకులు గ్రామశివార్లలో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
కారును వెంబండించి పట్టుకుంటే ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ అనే వ్యక్తులు అందులో ఉన్నారని బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..)
Comments
Please login to add a commentAdd a comment