ఇలశ్రీ(ఫైల్)
సంగారెడ్డి క్రైం: తన కూతురిని అత్తింటి వారు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు ఇలశ్రీ తండ్రి నంద్యాల రాములు ఆరోపించారు. గురువారం సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆస్పత్రిలో తన కూతురు ఇలశ్రీ పోస్టుమార్టం వద్ద ఆయన రోదించారు. అదనపు కట్నం కోసం వేధించి తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రోదించడం పలువురిని కలచివేసింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జగద్గిరి గుట్టకు చెందిన రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ నంద్యాల రాములు కూతురు ఇలశ్రీ(25)కి సంగారెడ్డిలోని నేతాజీనగర్‌కు చెందిన వెంకటేశం, వీరమణి దంపతుల కుమారుడు విఠల్ కృష్ణతో 2015లో అన్ని లాంఛనాలతో పెళ్లి జరిగింది. పెళ్లయినప్పటి నుంచి తన కూతురిని అత్తమామలు, మరిది, అల్లుడు విఠల్‌కృష్ణ తరచుగా అవమానించడమే కాకుండా సూటిపోటీ మాటలతో వే«ధించే వారన్నారు. ఇంట్లో చంపి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యకు పాల్పడితే మృతదేహాన్ని అలాగే ఉంచకుండా కింద పడుకోబెట్టి చీరను పక్కన పర్చి పోలీసులకు, తమకు సమాచారం అందించారని రోదిస్తూ వాపోయాడు. పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి నిందితుల ను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశా డు. మృతురాలికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఆర్యన్ ఉన్నాడు.
బంధువుల ఆందోళన..
మార్చురీ వద్ద నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇలశ్రీ కుటుంబ సభ్యులు, బంధువర్గం ఆందోళన చేపట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకొని శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా సీఐ రామకృష్ణారెడ్డి స్పందించి ఇప్పటికే కేసు నమోదు చేశా>మని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment