
ప్రతీకాత్మక చిత్రం
మహబూబాబాద్ : క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థికి ఏం బాధలు లేవు..అంతకన్నా కష్టాలు లేవు..కేవలం తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాకు చెందిన బానోత్ మోహన్(16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వాలని గత కొద్దిరోజుల నుంచి తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ ఇప్పించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment