ఎంబీబీఎస్ విద్యార్థి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మరిపెడ బంగ్లాలో వెలుగు చూసింది.
మహబూబాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జిల్లాలోని మరిపెడ బంగ్లా మండల కేంద్రంలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న గుగులోతు మనోజ్ కృష్ణ(19) ఒంగోలులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరిపెండ బంగ్లా రామవిలాస్ బజార్‌కు చెందిన మనోజ్ కృష్ణ తండ్రి ఉపాధ్యాయుడు, సోదరుడు కూడా డాక్టర్. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.