
ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాం
ఆర్థిక మందగమనం, విధుల నిర్వహణలో అధికారుల విఫలం, అవినీతి ఆరోపణలు వంటి సవాళ్లను అధిగమిస్తామని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు.
పనాజీ: ఆర్థిక మందగమనం, విధుల నిర్వహణలో అధికారుల విఫలం, అవినీతి ఆరోపణలు వంటి సవాళ్లను అధిగమిస్తామని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ పలుప్రతికూల పరిస్థితులను తమ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కుని ముందుకు సాగగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యరెండోసారి యూపీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాలనను పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఓటర్లు వ్యతిరేక భావనలో ఉండటం కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికితోడు ద్రవ్యోల్బణం, ఉద్యోగ కల్పన మందగించడం వంటి అంశాలు వ్యతిరేక ప్రభావానికి కారణమవుతున్నాయని వివరించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ప్రకటించారు. ఇక్కడ దగ్గర్లో జరిగిన థింక్‌ఫెస్ట్‌కు హాజరైన చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.