పనాజీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ శ్రేణులనే సున్నితంగా హెచ్చరించారు. గోవా బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ‘కాంగ్రెస్ చేసిన తప్పులనే మనం మళ్లీ చేస్తే వారికి మనకు తేడా ఏం ఉండదు.
బీజేపీ అంటేనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. అందుకే మనల్ని ప్రజలు పదే పదే నమ్మి అధికారం కట్టబెడుతున్నారు. రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికేనని బీజేపీ క్యాడర్ తెలుసుకోవాలి. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేయాలి. ఇందుకోసం మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి.
కుల రాజకీయాలు చేయకూడదు. కుల రాజకీయాలు చేస్తే ప్రతిచర్య కూడా గట్టిగా ఉంటుంది’అని 40 నిమిషాల పాటు గడ్కరీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ దక్కించుకోలేకపోయిన నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment