వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని ఐపీఎస్ దంపతులు వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. గోవాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు ప్రియాంక, కార్తీక్ కశ్యప్ భార్యాభర్తలు. ఇటీవల పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట.. రాష్ట్రంలో వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమేనని ఐపీఎస్ దంపతులు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.
ఇంతకుముందు కూడా గోవాలో ఇలాంటి సంఘటనే జరిగింది. బార్ డాన్సర్లకు మద్దతుగా ఓ బీజేపీ నాయకుడు మాట్లాడి ఆనక నాలుక్కరుకున్నాడు. ఆయన కూడా వ్యక్తిగత అభిప్రాయమంటూ వివరణ ఇచ్చుకున్నారు.
వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలన్న ఐపీఎస్ దంపతులు
Published Mon, Sep 30 2013 3:26 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement