‘క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేసింది’ | Cricket made me a better man: rahul Dravid | Sakshi
Sakshi News home page

‘క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేసింది’

Published Sun, Aug 11 2013 3:45 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

‘క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేసింది’

‘క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేసింది’

పనాజీ: ’క్రికెట్ నన్ను ఉన్నతమైన మనిషిని చేయడమే కాకుండా, మానవతా విలువలను నేర్పిందని ' భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.  ఆదివారం గోవాలో బిట్స్ పిలానీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన ద్రవిడ్ తన క్రికెట్ జీవితాన్ని నెమరవేసుకున్నాడు. తన క్రీడా జీవితం ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిందన్నాడు.


ఈ సభలో ప్రసంగించిన ద్రావిడ్ తన చిన్ననాటి అనుభూతుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.  చిన్నతనంలోనే స్కూల్ పిన్సిపాల్  తనలోని ప్రతిభని గుర్తించడం వల్లే క్రికెట్ జీవితం ఆరంభమైందని తెలిపాడు. తనది మధ్యతరగతి కుటుంబమని, తనకు తానకు చాలా విషయాలను నేర్చుకున్నానన్నాడు. ఈ  సందర్భంగా యువతకు ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. ‘ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండేందుకు ప్రయత్నించవద్దు, నీకు నువ్వు నంబర్ వన్ వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించు' అని  రాహుల్ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement