
పనాజీ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో చాలా చోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాత్రికర్ఫ్యూ అన్ని చోట్ల అమల్లో ఉండగా కరోనా కట్టడి కావడం లేదు. దీంతో విధిలేక సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉండగా తాజాగా గోవాలో లాక్‌డౌన్ విధించింది.
అయితే ఈ లాక్‌డౌన్ కేవలం నాలుగంటే నాలుగే రోజులు లాక్‌డౌన్ విధించడం గమనార్హం. నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. రేపు రాత్రి (ఏప్రిల్ 29వ తేదీ) 7 గంటల నుంచి మే 3 వరకు గోవాలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా, హోటళ్లు, పబ్‌లు, మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుందని వివరించారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని గుర్తుచేశారు. ప్రస్తుతం గోవాలో రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు.
చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
Comments
Please login to add a commentAdd a comment