నన్ను విలన్‌లా చూస్తున్నారు: గోవా సీఎం | I am projected as a villain, says manohar Parrikar | Sakshi
Sakshi News home page

నన్ను విలన్‌లా చూస్తున్నారు: గోవా సీఎం

Published Mon, Aug 19 2013 3:26 PM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

I am projected as a villain, says manohar Parrikar

పనాజీ: ‘నన్ను కొందరు హిట్లర్‌లా చూస్తున్నారు. మరి కొందరు విలన్‌లా భావిస్తున్నారు. ఎవరేమనుకున్నా దాన్ని ఒక అభినందనగానే భావిస్తున్నానని’ గోవా సీఎం మనోహర్ పరికర్ తెలిపారు. ఫోటో జర్నలిస్టులు సోమవారం నిర్వహించిన ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
 
 కొంతమంది ప్రజలు తనను విలన్‌లా,  హిట్లర్‌లా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన ఒక అభినందనలాగా భావిస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నందున అదే పెద్ద తప్పేమీ కాదన్నారు. తనపై వచ్చే విమర్శలపై స్పందించాలనుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర నదీ తీరాల్లోకి కాసినోలను అనుమతించేది లేదంటూనే ఈ మధ్య డెల్టా కార్పోరేషన్ లిమిటెట్ హార్స్ షోకి అనుమతి ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement