photo journalists
-
సునిశిత దృష్టితో గొప్ప కళాఖండాలు
సాక్షి, అమరావతి: ఫొటో జర్నలిస్టుల సునిశిత దృష్టి గొప్ప కళా ఖండాలను సృష్టిస్తుందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు అన్నారు. మంగళవారం మీడియా అకాడమీ కార్యాలయంలో ‘ప్రపంచ ఫొటోగ్రఫీ–2023’ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమన్నారు. రాజకీయ, సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించడంలో ఫొటో జర్నలిస్టులు తీసే ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విపత్తుల సమయంలో ఫొటో జర్నలిస్టుల సాహసోపేత సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, ఫొటో ఇండియా అధినేత శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు, జనరల్ సెక్రటరీ రూబెన్ బేసాలియల్, ఇతర విజేతలు తమ వృత్తిలోని మరుపురాని, కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. -
ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్‌గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్‌రెడ్డి, ఠాకూర్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో పలు కేటగిరీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టులు విజేతలుగా నిలిచారు. బంగారు తెలంగాణ కేటగిరీలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంపై బెస్ట్ ఫొటో తీసినందుకు సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు శివప్రసాద్ ప్రోత్సాహక బహుమతి (కన్సోలేషన్ ఫ్రైజ్) దక్కించుకున్నాడు. కేటగిరీ–2లో జనగామ జిల్లా ఫొటో జర్నలిస్టు జి.వేణుగోపాల్ తృతీయ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎం.రవి కన్సోలేషన్ ఫ్రైజ్ సొంతం చేసుకున్నారు. కేటగిరీ–3లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో జర్నలిస్టు వై.శ్రీకాంత్ ప్రథమ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎ.సురేశ్ కుమార్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఇదే కేటగిరీలో కరీంగనర్ ఫొటో జర్నలిస్టు జి.స్వామి ప్రోత్సాహక బహుమతి దక్కించుకున్నాడు. వీరంతా ఈ నెల 19న హైదారాబాద్‌లో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందుకోనున్నారు. టీపీజేఏ అవార్డుల్లోనూ హవా: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన పోటీ ల్లోనూ సాక్షి ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫొటో జర్నలిస్టు దశరథ్ రజువా, హైదరాబాద్ ఫొటో జర్న లిస్టు రాకేశ్, మహబూబ్‌నగర్ ఫొటో జర్నలిస్టు భాస్కరాచారి కన్సోలేషన్ ఫ్రైజ్‌లు సొంతం చేసుకున్నారు. వీరంతా 19న అవార్డులు అందుకోనున్నారు. -
భజ్జీ పెళ్లిలో బౌన్సర్ల దాడి
జలంధర్: వైభవంగా జరిగిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహంలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ వేడుకను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఫొటో జర్నలిస్టులపై నలుగురు బౌన్సర్లు దాడి చేసి చితకబాదారు. దీంతో బౌన్సర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాస్తవానికి తన పెళ్లి వేడుకలను చిత్రీకరించేందుకు భజ్జీ ఓ న్యూస్ చానెల్‌కు హక్కులను ఇచ్చాడు. ఈ కారణం చేత బౌన్సర్లు ఇతర మీడియా సిబ్బందిపై దాడికి దిగారు. -
నన్ను విలన్లా చూస్తున్నారు: గోవా సీఎం
పనాజీ: ‘నన్ను కొందరు హిట్లర్‌లా చూస్తున్నారు. మరి కొందరు విలన్లా భావిస్తున్నారు. ఎవరేమనుకున్నా దాన్ని ఒక అభినందనగానే భావిస్తున్నానని’ గోవా సీఎం మనోహర్ పరికర్ తెలిపారు. ఫోటో జర్నలిస్టులు సోమవారం నిర్వహించిన ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొంతమంది ప్రజలు తనను విలన్లా, హిట్లర్‌లా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన ఒక అభినందనలాగా భావిస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నందున అదే పెద్ద తప్పేమీ కాదన్నారు. తనపై వచ్చే విమర్శలపై స్పందించాలనుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర నదీ తీరాల్లోకి కాసినోలను అనుమతించేది లేదంటూనే ఈ మధ్య డెల్టా కార్పోరేషన్ లిమిటెట్ హార్స్ షోకి అనుమతి ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుంది.