సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో పలు కేటగిరీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టులు విజేతలుగా నిలిచారు. బంగారు తెలంగాణ కేటగిరీలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంపై బెస్ట్ ఫొటో తీసినందుకు సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు శివప్రసాద్ ప్రోత్సాహక బహుమతి (కన్సోలేషన్ ఫ్రైజ్) దక్కించుకున్నాడు. కేటగిరీ–2లో జనగామ జిల్లా ఫొటో జర్నలిస్టు జి.వేణుగోపాల్ తృతీయ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎం.రవి కన్సోలేషన్ ఫ్రైజ్ సొంతం చేసుకున్నారు.
కేటగిరీ–3లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో జర్నలిస్టు వై.శ్రీకాంత్ ప్రథమ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎ.సురేశ్ కుమార్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఇదే కేటగిరీలో కరీంగనర్ ఫొటో జర్నలిస్టు జి.స్వామి ప్రోత్సాహక బహుమతి దక్కించుకున్నాడు. వీరంతా ఈ నెల 19న హైదారాబాద్‌లో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందుకోనున్నారు.
టీపీజేఏ అవార్డుల్లోనూ హవా: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన పోటీ ల్లోనూ సాక్షి ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫొటో జర్నలిస్టు దశరథ్ రజువా, హైదరాబాద్ ఫొటో జర్న లిస్టు రాకేశ్, మహబూబ్‌నగర్ ఫొటో జర్నలిస్టు భాస్కరాచారి కన్సోలేషన్ ఫ్రైజ్‌లు సొంతం చేసుకున్నారు. వీరంతా 19న అవార్డులు అందుకోనున్నారు.
సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు
Published Fri, Aug 18 2017 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement