జలంధర్: వైభవంగా జరిగిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహంలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ వేడుకను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఫొటో జర్నలిస్టులపై నలుగురు బౌన్సర్లు దాడి చేసి చితకబాదారు. దీంతో బౌన్సర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాస్తవానికి తన పెళ్లి వేడుకలను చిత్రీకరించేందుకు భజ్జీ ఓ న్యూస్ చానెల్‌కు హక్కులను ఇచ్చాడు. ఈ కారణం చేత బౌన్సర్లు ఇతర మీడియా సిబ్బందిపై దాడికి దిగారు.