సాక్షి, అమరావతి: ఫొటో జర్నలిస్టుల సునిశిత దృష్టి గొప్ప కళా ఖండాలను సృష్టిస్తుందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు అన్నారు. మంగళవారం మీడియా అకాడమీ కార్యాలయంలో ‘ప్రపంచ ఫొటోగ్రఫీ–2023’ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమన్నారు.
రాజకీయ, సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించడంలో ఫొటో జర్నలిస్టులు తీసే ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విపత్తుల సమయంలో ఫొటో జర్నలిస్టుల సాహసోపేత సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, ఫొటో ఇండియా అధినేత శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు, జనరల్ సెక్రటరీ రూబెన్ బేసాలియల్, ఇతర విజేతలు తమ వృత్తిలోని మరుపురాని, కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment