
మోదీకన్నా వాజపేయి తీవ్ర హిందూవాది కానీ..
పనాజీ: ప్రధాని నరేంద్రమోదీ మాదిరిగా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి కూడా తీవ్ర హిందూజాతీయవాది అని అయితే, ఆయన జాతీయవాదాన్నే అన్నింటికన్నా ముందుంచారని మాజీ కేంద్రమంత్రి ఎడ్వార్డో ఫలైరో అన్నారు.
గోవా నుంచి ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన ఆయన శుక్రవారం పనాజీలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో అశాంతి, అసహనం, పరమత ద్వేశం హింస పెరిగిపోతుందని ఆయన ఆరోపించారు. బీఫ్ వివాదం, దేశంలో అసహనం పెరిగిపోతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రముఖ రచయితలు, పరిశోధనకారులు, శాస్త్రవేత్తలు తమకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇస్తుండటంపట్ల స్పందిస్తూ ఆయన ఈ వివరణ ఇచ్చారు.