తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట | short term relief to tejpal | Sakshi
Sakshi News home page

తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట

Published Sat, Nov 30 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట

తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట

  మధ్యంతర రక్షణ కల్పించిన కోర్టు   
 నేటి ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు

  పణజీ: శుక్రవారం రోజంతా నడిచిన హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో తెహెల్కా  ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట లభించింది. తెహెల్కా  మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయన్ను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయూన గోవా, ఢిల్లీ పోలీసుల బృందం తేజ్‌పాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతో ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. ఆయన లేకపోవడంతో పలుచోట్ల గాలించింది.
 
 అయితే తేజ్‌పాల్‌కు శనివారం ఉదయం వరకు ఊరటనిస్తూ జిల్లా, సెషన్స్ జడ్జి అనూజ ప్రభుదేశాయ్ ఆదేశాలు జారీ చేసే సమయూనికి ఆయన పణజీలో ప్రత్యక్షమయ్యూరు. భార్య గీతన్ బాత్రా, ఇతర కుటుంబసభ్యులు, న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో బయలుదేరి సాయంత్రానికి గోవా చేరుకున్నారు. విమానం ఎక్కే ముందు పోలీసుల సమన్లు అందడంతో గోవా వెళుతున్నట్టు తేజ్‌పాల్ చెప్పారు. అదే విమానం ఎక్కిన టీవీ జర్నలిస్టులు తేజ్‌పాల్ వివరణ కోసం శతవిధాలా ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఒకదశలో విమాన సిబ్బంది మరొక గమ్యస్థానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది.
 
 వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్‌పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెరుులబుల్ వారంట్లు జారీ చేశారు. అరుుతే తేజ్‌పాల్ తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వారుుదా వేశారు. అనంతరం జరిగిన బెరుుల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. తేజ్‌పాల్ ఎంతో పరువు, ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అని, హోటల్ సీసీ టీవీ ఫుటేజీ ఆయన నిర్దోషి అనే విషయం తెలియజేస్తుందని ఆయన తరఫు న్యాయవాది గీతా లూత్రా  పేర్కొన్నారు. సంఘటనానంతరం కూడా సాధారణంగానే కన్పిస్తున్న బాధితురాలి నుంచి 10 రోజుల తర్వాత ఫిర్యాదు అందడాన్ని ఆమె ప్రస్తావించారు. బాధితురాలి పేరును కూడా ఆమె రెండుసార్లు ప్రస్తావించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్జి కూడా పేరు ప్రస్తావించడం సరికాదంటూ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉందో మీకు తెలుసునంటూ వ్యాఖ్యానించారు.
 
 ఈ క్రమంలో లూత్రా దీని వెనుక రాజకీయ హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తేజ్‌పాల్‌పై నిర్దిష్ట ఆరోపణలు లేవని చెప్పారు. ఆయన మానవ హక్కుల కోసం నిలబడిన వ్యక్తిగా పేర్కొన్నారు. హోటల్ లిఫ్ట్ బయట, లోపల సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రైవేటుగా పరిశీలించాలని ఆమె కోరారు. సంఘటన జరిగిన రెండురోజుల తర్వాత బాధితురాలు తేజ్‌పాల్‌తో, ప్రముఖ రచరుుత రాబర్ట్ డి నీరోతో కలిసి ఉన్న ఫొటోను కోర్టు ముందుంచారు. ఆ ఫొటోలో బాధితురాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ఉన్నట్టు కనబడుతోందని చెప్పారు. గోవాలో దిగిన తేజ్‌పాల్‌కు స్థానిక బీజేపీ యువమోర్చా నుంచి నిరసన ఎదురైంది. అంతకుముందు తేజ్‌పాల్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, తదనంతర విచారణ చట్టబద్ధతను ప్రశ్నించారు. తనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదూ లేదన్నారు. ఆఫీసు నుంచి వచ్చే అంతర్గత మెరుుల్ సుమోటో ఎఫ్‌ఐఆర్‌ను నిర్ణయిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ యూవత్ ఉదంతం వెనుక రాజకీయ కుట్ర ఉందనే సంకేతాలిచ్చారు. ఢిల్లీలోని కొందరు గంట గంటకూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు.
 
 తేజ్‌పాల్ ఆరోపణలు నిరాధారం: బీజేపీ
 బీజేపీతో పాటు గోవాలోని ఆ పార్టీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నాయన్న తేజ్‌పాల్ ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. తేజ్‌పాల్ ఆరోపణలు నిరాధారమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement