lady journalist
-
అల్ జజీరా మహిళా జర్నలిస్టు కాల్చివేత
జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు షిరీన్ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు షిరీన్ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది. బులెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా... కవరేజీ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించారు. పాలస్తీనా సాయుధుల కాల్పుల్లోనే ఆమె చనిపోయినట్టు తమకు సమాచారముందన్నారు. Large crowds gathering in Jenin to sat good bye to veteran AlJazeera Arabic journalist who was shot dead by Israeli fire while reporting near Jenin refugee camp. pic.twitter.com/1oLoCUIeXR — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 AlJazeera journalists & other Palestinian reporters at the scene say veteran @AJArabic reporter Shireen Abu wallah was ´killed in cold blood’ by Israeli forces as she reported on an Israeli raid on Jenin refugee camp. pic.twitter.com/RRsP3PY7GF — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 -
మావోయిస్టుల అడ్డాలో మహిళా రిపోర్టర్!
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ బురుడ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది.అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని, తనలాంటి తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళా జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది. ఇంట్లో తొమ్మిదో అమ్మాయి! పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి తొమ్మిదో అమ్మాయి. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి ఎన్నో కష్టాలకోర్చి పిల్లల్ని చదివించారు. జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకబడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది. పట్టు పట్టి కలం పట్టింది జర్నలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది జయంతి. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ, ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్లో ఉండి చదువుకునే ఆర్థికస్తోమతా లేదు. ఆ సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. చదువు అయిపోగానే ఇంటర్న్‌షిప్ కోసం జయంతి భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. జర్నలిజంలోనూ లింగ వివక్ష ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది జయంతి. ప్రస్తుతం ‘కళింగ’ టీవీలో పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కన్‌గిరిలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరిలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష సహోద్యోగులు జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో పథకాలు వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది. పోలీసుల వేధింపులు వీటన్నింటికీ మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు! ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగా ఉండటం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాల వేధింపులు ఆమెకు తప్పలేదు.ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవో సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్ -
జింబాబ్వేలో అమెరికా జర్నలిస్టు అరెస్టు
హరారే: జింబాబ్వే అధ్యక్షుడు ముగాబేను పదవి నుంచి దింపేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఓ అమెరికా మహిళా జర్నలిస్టుపై కేసు నమోదైంది. 25 ఏళ్ల మార్థ డొనోవన్ అనే అమెరికా జర్నలిస్టు హరారేలో ఓ చానల్లో పనిచేస్తున్నారు. డొనోవన్ ముగాబే పేరును నేరుగా ప్రస్తావించకుండానే ‘ఒక స్వార్థపరుడైన రోగి ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు’ అని ట్వీట్ చేశారనీ, ఆ ట్వీట్‌కు రోగిగా ఉన్న ముగాబే ఫొటోను పెట్టారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జింబాబ్వే పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఆరోపణలను ఖండించిన డొనోవన్ తరఫు న్యాయవాది, బెయిలు కోసం హైకోర్టుకు వెళ్తామన్నారు. యూఎస్ రాయబార కార్యాలయం కూడా డొనోవన్తో సంప్రదింపులు జరుపుతోంది. -
తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట
మధ్యంతర రక్షణ కల్పించిన కోర్టు నేటి ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు పణజీ: శుక్రవారం రోజంతా నడిచిన హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు స్వల్ప ఊరట లభించింది. తెహెల్కా మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయన్ను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయూన గోవా, ఢిల్లీ పోలీసుల బృందం తేజ్పాల్ను అరెస్టు చేసే ఉద్దేశంతో ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. ఆయన లేకపోవడంతో పలుచోట్ల గాలించింది. అయితే తేజ్‌పాల్‌కు శనివారం ఉదయం వరకు ఊరటనిస్తూ జిల్లా, సెషన్స్ జడ్జి అనూజ ప్రభుదేశాయ్ ఆదేశాలు జారీ చేసే సమయూనికి ఆయన పణజీలో ప్రత్యక్షమయ్యూరు. భార్య గీతన్ బాత్రా, ఇతర కుటుంబసభ్యులు, న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో బయలుదేరి సాయంత్రానికి గోవా చేరుకున్నారు. విమానం ఎక్కే ముందు పోలీసుల సమన్లు అందడంతో గోవా వెళుతున్నట్టు తేజ్‌పాల్ చెప్పారు. అదే విమానం ఎక్కిన టీవీ జర్నలిస్టులు తేజ్‌పాల్ వివరణ కోసం శతవిధాలా ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఒకదశలో విమాన సిబ్బంది మరొక గమ్యస్థానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్‌పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెరుులబుల్ వారంట్లు జారీ చేశారు. అరుుతే తేజ్‌పాల్ తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వారుుదా వేశారు. అనంతరం జరిగిన బెరుుల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. తేజ్‌పాల్ ఎంతో పరువు, ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అని, హోటల్ సీసీ టీవీ ఫుటేజీ ఆయన నిర్దోషి అనే విషయం తెలియజేస్తుందని ఆయన తరఫు న్యాయవాది గీతా లూత్రా పేర్కొన్నారు. సంఘటనానంతరం కూడా సాధారణంగానే కన్పిస్తున్న బాధితురాలి నుంచి 10 రోజుల తర్వాత ఫిర్యాదు అందడాన్ని ఆమె ప్రస్తావించారు. బాధితురాలి పేరును కూడా ఆమె రెండుసార్లు ప్రస్తావించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్జి కూడా పేరు ప్రస్తావించడం సరికాదంటూ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉందో మీకు తెలుసునంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో లూత్రా దీని వెనుక రాజకీయ హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తేజ్పాల్పై నిర్దిష్ట ఆరోపణలు లేవని చెప్పారు. ఆయన మానవ హక్కుల కోసం నిలబడిన వ్యక్తిగా పేర్కొన్నారు. హోటల్ లిఫ్ట్ బయట, లోపల సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రైవేటుగా పరిశీలించాలని ఆమె కోరారు. సంఘటన జరిగిన రెండురోజుల తర్వాత బాధితురాలు తేజ్‌పాల్‌తో, ప్రముఖ రచరుుత రాబర్ట్ డి నీరోతో కలిసి ఉన్న ఫొటోను కోర్టు ముందుంచారు. ఆ ఫొటోలో బాధితురాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ఉన్నట్టు కనబడుతోందని చెప్పారు. గోవాలో దిగిన తేజ్‌పాల్‌కు స్థానిక బీజేపీ యువమోర్చా నుంచి నిరసన ఎదురైంది. అంతకుముందు తేజ్‌పాల్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్, తదనంతర విచారణ చట్టబద్ధతను ప్రశ్నించారు. తనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదూ లేదన్నారు. ఆఫీసు నుంచి వచ్చే అంతర్గత మెరుుల్ సుమోటో ఎఫ్ఐఆర్ను నిర్ణయిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ యూవత్ ఉదంతం వెనుక రాజకీయ కుట్ర ఉందనే సంకేతాలిచ్చారు. ఢిల్లీలోని కొందరు గంట గంటకూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. తేజ్‌పాల్ ఆరోపణలు నిరాధారం: బీజేపీ బీజేపీతో పాటు గోవాలోని ఆ పార్టీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నాయన్న తేజ్‌పాల్ ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. తేజ్‌పాల్ ఆరోపణలు నిరాధారమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు.