హరారే: జింబాబ్వే అధ్యక్షుడు ముగాబేను పదవి నుంచి దింపేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఓ అమెరికా మహిళా జర్నలిస్టుపై కేసు నమోదైంది. 25 ఏళ్ల మార్థ డొనోవన్ అనే అమెరికా జర్నలిస్టు హరారేలో ఓ చానల్‌లో పనిచేస్తున్నారు. డొనోవన్ ముగాబే పేరును నేరుగా ప్రస్తావించకుండానే ‘ఒక స్వార్థపరుడైన రోగి ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు’ అని ట్వీట్ చేశారనీ, ఆ ట్వీట్‌కు రోగిగా ఉన్న ముగాబే ఫొటోను పెట్టారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జింబాబ్వే పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఆరోపణలను ఖండించిన డొనోవన్ తరఫు న్యాయవాది, బెయిలు కోసం హైకోర్టుకు వెళ్తామన్నారు. యూఎస్ రాయబార కార్యాలయం కూడా డొనోవన్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment