
విదేశీ బాలికపై అత్యాచారం
పనాజీ: గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఇస్టోనియా దేశానికి చెందిన టీనేజీ బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో బాధితురాలు అంజునా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ముంబైకి చెందిన షమీమ్ పేషిమామ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అత్యాచారం విషయం ఎవరికైనా వెల్లడిస్తే తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడు బెదిరించాడని ఇస్టోనియా బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం యువతి వద్దనున్న సెల్ఫోన్, నగదు తీసుకుని నిందితుడు పరారైయ్యాడని పోలీసులు తెలిపారు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా గ్రామంలో ఈ అత్యాచారఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఉత్తర గోవాలోని చపోరా గ్రామం నేరాలు, మాదకద్రవ్యాలకు నిలయమని పోలీసులు వెల్లడించారు.