పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.30 గంటలకు గోవాకు బయలుదేరాల్పిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు తీవ్ర జాప్యమైంది. ఆ విమానం తెల్లవారుజామున 3. 30 గంటలకు గమ్యస్ధానం చేరుకుంది. విమానం గోవాకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ విమానంలో గోవా ఫార్వర్డు పార్టీ నాయకుడు కేతన్ భాటికర్ కూడా ప్రయాణిస్తున్నారు.
ఢిల్లీలో ఉన్న గోవా ముఖ్యమంత్రికి కేతన్ భాటికర్ విమాన అలస్యం విషయం గురించి రాత్రి 1.13 గంటలకు ఫోన్‌లో వివరించారు. సీఎం ప్రమోద్ వెంటనే స్పందించి ప్రయాణీకులకు భోజనాలు సమకూర్చారు. తర్వాత రాత్రి 1.27 గంటలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరో 30 నిమిషాల్లో విమానం బయలుదేరుతుందని సమాచారం అందించారని భాటికర్ తెలిపారు. గోవా సీఎం స్పందించిన తీరు పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment