Pramod Kumar
-
దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఫౌజా నచ్చుతుంది: దర్శకుడు ప్రమోద్ కుమార్
‘‘డబ్బులిచ్చి బ్రాండెడ్ బట్టలు కొన్నంత సులువుగా ఆర్మీ యూనిఫామ్‌ని కొనలేం. కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి. దేశభక్తి ఉంటేనే అది సాధించగలం. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మా ‘ఫౌజా’ నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తాం’’ అని ప్రమోద్ కుమార్ పున్హానా అన్నారు. కార్తీక్ దమ్ము, పవన్ మల్హోత్రా, ఐశ్వర్యా సింగ్ ముఖ్య తారలుగా ప్రమోద్ కుమార్ పున్హానా దర్శకత్వంలో అజిత్ దాల్మియా నిర్మించిన హిందీ చిత్రం ‘ఫౌజా’.ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ఫౌజా’ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో హీరో విజయ్ ధరన్ దాట్ల, ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా. డి. సురేష్, కాంతి డి. సురేష్ తదితరులు ఉన్నారు. ‘‘ఫౌజీ’లాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు’’ అని ఈ సందర్భంగా హీరో కార్తీక్ చెప్పారు. ‘‘హిందీలో మా చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తెలుగు ప్రేక్షకులూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అజిత్ దాల్మియా అన్నారు. -
బ్లాక్‌చెయిన్ ప్రమాణాలపై బీఐఎస్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలకు కూడా ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలోనూ పురోగమిస్తోందని ఆయన చెప్పారు. అటు పసిడి హాల్‌మార్కింగ్‌కు నిర్దేశించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని తివారీ స్పష్టం చేశారు. పాత నిల్వలను విక్రయించుకునేందుకు జ్యుయలర్లకు రెండేళ్ల పైగా గడువును ఇచ్చామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేసేలా తప్పనిసరిగా 6 అంకెల హాల్‌మార్క్ విశిష్ట గుర్తింపు సంఖ్యతోనే (హెచ్‌యూఐడీ) విక్రయించాలన్న నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకే తాము ప్రమాణాలను రూపొందిస్తున్నామని తివారీ వివరించారు. ఇతర దేశాలతో కూడా వాణిజ్యం జరిపేందుకు వీలుగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. -
Pramod Kumar: సిటీ బస్ ప్రాణం తీసింది
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): బెంగళూరు నగరంలో గుంతల రోడ్లు, బీఎంటీసీ (బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్) సర్వీసులు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడిపై బస్సు దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు... హాసన్ జిల్లా చెన్నరాయపట్టణకు చెందిన ప్రమోద్ కుమార్ (24) లగ్గేరిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని కామాక్షిపాళ్య రింగ్ రోడ్డు చౌడేశ్వరి నగర హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వస్తుండగా వాయువేగంతో వస్తున్న బీఎంటీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. కిందపడిన ప్రమోద్‌పై దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ను హసిమ్ ఆసబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యశవంతపుర–బనశంకరిల మధ్య సంచరించే బస్‌లోని ప్రయాణికులు ఘటన జరిగిన సమయంలో డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే) -
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
సీఎం ఔదార్యానికి ఫిదా..
పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.30 గంటలకు గోవాకు బయలుదేరాల్పిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు తీవ్ర జాప్యమైంది. ఆ విమానం తెల్లవారుజామున 3. 30 గంటలకు గమ్యస్ధానం చేరుకుంది. విమానం గోవాకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ విమానంలో గోవా ఫార్వర్డు పార్టీ నాయకుడు కేతన్ భాటికర్ కూడా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గోవా ముఖ్యమంత్రికి కేతన్ భాటికర్ విమాన అలస్యం విషయం గురించి రాత్రి 1.13 గంటలకు ఫోన్లో వివరించారు. సీఎం ప్రమోద్ వెంటనే స్పందించి ప్రయాణీకులకు భోజనాలు సమకూర్చారు. తర్వాత రాత్రి 1.27 గంటలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరో 30 నిమిషాల్లో విమానం బయలుదేరుతుందని సమాచారం అందించారని భాటికర్ తెలిపారు. గోవా సీఎం స్పందించిన తీరు పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
విమానంలో వ్యాపారవేత్తకు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వ్యాపారవేత్తకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. భారత కరెన్సీ చెల్లక పోవడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రమోద్ కుమార్ జైన్ ఇటీవల బెంగళూరు నుంచి దుబాయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఏదో వస్తువు కొనుగోలు చేయడం లేదా అవసరాల నిమిత్తం మన కరెన్సీని చెల్లించాలని చూడగా కరెన్సీ చెల్లదంటూ సిబ్బంది వాటిని తిరస్కరించారు. దేశానికి చెందిన కరెన్సీ చెల్లదని భారత్ నుంచి వెళ్తున్న విమానంలో చెప్పడంతో వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ కంగుతిన్నారు. దేశం నుంచి నడుస్తున్న విమానంలో భారత కరెన్సీ చెల్లదని చెప్పడం దేశద్రోహ చర్యగా పరిగణిస్తారు. దీనిపై తాను ఢిల్లీ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయుల గౌరవ చట్టం 1971 ప్రకారం స్వదేశంలోనే కరెన్సీ చెల్లదని, స్వీకరించకపోవడం ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుపై డిసెంబర్ 15న విచారణ జరగనున్నట్లు ప్రమోద్ కుమార్ జైన్ వివరించారు. స్వదేశం నుంచి తిరుగుతున్న విమానాల్లోనే మన కరెన్సీ చెల్లదంటూ, ఆ డబ్బును వెనక్కి ఇవ్వడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. -
టాయిలెట్ లేదని అత్తారింటిపై అలిగాడు
రాంచి: అత్త వారింట్లో మరుగుదొడ్డి లేకపోవటంతో అలిగిన అల్లుడు అది నిర్మించే వరకు తాను వెళ్లబోనని, భార్యను వెళ్లనిచ్చేది లేదని భీష్మించాడు. జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భులి పట్టణానికి చెందిన ప్రమోద్‌కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 15 వ తేదీన గిరిదిధ్ జిల్లా జోగ్తియాబాద్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే అత్తవారింటికి వెళ్లిన ప్రమోద్ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో టాయిలెట్ ఎక్కడుందని అత్త వారింట్లో వాకబు చేయగా.. వారు అతనికి నీళ్ల చెంబు అందించి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత భార్యతో తన స్వగ్రామానికి చేరుకున్న అతడు.. టాయిలెట్ కట్టేదాకా అత్తవారింటికి వెళ్లేది లేదని తెగేసి చెప్పాడు. అంతేకాదు, భార్యను కూడా వెళ్లనిచ్చేది లేదని అడ్డుపడ్డాడు. దీంతో దిగివచ్చిన మామ జగదేశ్వర్ పాశ్వాన్... అల్లుడి కోరిక మేరకు మరుగుదొడ్డి నిర్మించేందుకు ఏర్పాట్లు చేపట్టాడు. దీంతో త్వరలోనే కూతురు, అల్లుడు తమ ఇంటికి వస్తారని పాశ్వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మారేందుకు జార్ఖండ్ కృషి చేస్తోంది. -
జెండా ఎగురవేసిన గంటకే..!
-
జెండా ఎగురవేసిన గంటకే..!
దేశభక్తుడైన ఆ సైనికాధికారి సోమవారం ఉదయం 8.29 గంటలకు మువ్వన్నెల జాతీయపతాకాన్ని ఎగురవేశాడు. ఆకాశంలో రెపరెపలాడుతున్న జెండాకు సెల్యూట్ చేసి.. జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం తన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభక్తిని రగిలించే స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే తన కర్తవ్యదీక్షలో నిమగ్నమైన ఆయనను మృత్యువు వెంటాడింది. జాతీయజెండా ఎగురవేసిన గంటసేపటికే ఆయన జాతీయజెండాలో చుట్టబడిన అమరవీరుడిగా మారిపోయారు. ఆయనే సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్ కుమార్. స్వాతంత్ర్య దినోత్సవమైన సోమవారం శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన ప్రాణాలు విడిచారు. శ్రీనగర్ లోని కరన్ నగర్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో కమాండెంట్ ప్రమోద్ ఉదయం జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ సీఆర్పీఎఫ్ డీజీ సందేశాన్ని తన సైనిక బృందానికి వినిపించారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. 'ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు కశ్మీర్ లో రాళ్లు విసురుతుండటాన్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ దేశ సమగ్రత, సమైక్యత, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను నిలబెట్టేందుకు కృషిచేద్దాం. ఎంతో మహత్తరమైన పోరాటం తర్వాత ఇవి మనకు లభించాయి' అని ఆయన పేర్కొన్నారు. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని నౌవాట్టా ప్రాంతంలో ఇద్దరు మిలిటెంట్లు కాల్పులకు దిగారని సమాచారం అందడంతో ఆయన వెంటనే సీఆర్పీఎఫ్ బృందంతో అక్కడికి చేరారు. మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రమోద్ నాయకత్వం వహించారు. ఆయన గన్ నుంచి దూసుకుపోయిన తూటా ఓ మిలిటెంట్ ను హతమార్చింది. కానీ అంతలోనే ఓ మిలిటెంట్ తూటా వచ్చి ఆయన మెడకు దిగింది. కోమాలోకి వెళ్లిపోయిన ఆయనను వెంటనే శ్రీనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయిందని, మధ్యాహ్నానికి ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి భవేష్ చౌదరి తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో మరో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఓ కశ్మీర్ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. తలలో తూటా దిగిన పోలీసు అధికారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. -
కశ్మీర్లో మళ్లీ కాల్పులు ఇద్దరు జవాన్ల మృతి
-
కశ్మీర్లో మళ్లీ కాల్పులు ఇద్దరు జవాన్ల మృతి
కశ్మీర్ లోయలో మళ్లీ తీవ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రడాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో కశ్మీర్ లోయలో ఉద్రిక్తంగా మారింది. శ్రీనగర్ నౌహట్టా డౌన్ టౌన్‌లోని చారిత్మ్రాక జమా మస్జిద్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరగడం ఆందోళనకు దారితీసింది. దీంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. మిలిటెంట్లు ఓ భవనంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ మిలిటెంట్లను గుర్తించాల్సి ఉంది. రెండు ఏకే తుపాకులు, ఎనిమిది వారపత్రికలను వీరు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్‌కు చెందిన ప్రమోద్ కుమార్ జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కూతురు(7) ఉన్నారు. అతని అంత్యక్రియలు మంగళవారం అతని స్వగ్రామమైన కంటారాలోని మిహిజంలో జరగనున్నాయి. -
కోఠి హరిద్వార్ హోటల్ లో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ఓ యువకుడు ఆనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన నగరంలోని కోఠి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక హరిద్వార్ హోటల్లో ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. అదిలాబాద్‌కు చెందిన లారీ ఓనర్ ప్రమోద్‌కుమార్ హోటల్ లోని కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గది తలుపులు తెరిచి శవాన్ని కిందికి దించారు. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
హత్నూర, న్యూస్‌లైన్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్, డ్రైవర్‌తో సహ ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని నస్తీపూర్ శివారులో సంగారెడ్డి, నర్సాపూర్ ప్రధాన రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రమాద్‌కుమార్ కథనం మేరకు.. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వస్తోంది. అయితే మండలంలోని నస్తీపూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెడిపోయి రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని ఢీకొన్నాడు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ రాజునాయక్, కండక్టర్ జానమ్మతో పాటు ప్రయాణికులు కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామానికి చెందిన డప్పు జగన్, అతడి భార్య పోచమ్మ, హత్నూర మండలం కిసింద్లాపూర్ గ్రామానికి చెందిన రుక్కమ్మ, నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన కుర్మ నారాయణ, శివ్వంపేట మండలంకు చెందిన అల్లీపూర్ అశోక్, చిక్మద్దుర్ గ్రామానికి చెందిన జగ్గంపేట నవీన్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ ప్రమోద్‌కుమార్ తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడి నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీమంత్రి సునీతారెడ్డి శనివారం సాయంత్రం పరామర్శించారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణపై అభినందనలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు సమర్థవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్కుమార్లను ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ వారి చాంబర్లలో కలిసి అభినందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో జిల్లాను ముందు వరుసలో ఉంచారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గంటన్నరలోపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు ఏ స్వాములు, పీ మదన్మోహన్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎస్ఎన్ఎం వలి, ఐసీహెచ్ మాలకొండయ్య, కే శివకుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే పద్మకుమారి,కార్యదర్శి ఎన్వీ విజయలక్ష్మి తదితరులున్నారు. -
తెర వెనుక తెలుగు సినిమా
‘‘చిత్ర పరిశ్రమలో పదేళ్లపాటు ఉంటే చాలు.. వారికి ఎన్నో గొప్ప అనుభవాలు ఎదురవుతాయి. వాటికి ఓ పుస్తక రూపాన్నిస్తే అది మహాగ్రంథమే అవుతుంది. తెర వెనక జరిగిన ఎన్నో సంఘటనల సమాహారంగా ప్రచురించబడ్డ ఈ పుస్తకానికి ‘నేను చూసిన తెరవెనుక తెలుగు సినిమా’ అనే పేరు పెడితే బాగుండేది’’ అని దాసరి నారాయణరావు అభిప్రాయపడ్డారు. పబ్లిసిటీ ఇన్చార్జ్ ప్రమోద్‌కుమార్ రచించిన ‘తెర వెనుక తెలుగు సినిమా’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించి, దాసరి, మోహన్‌బాబు, ఈశ్వర్లకు అందించారు. ఇంకా దాసరి మాట్లాడుతూ- ‘‘ప్రమోద్‌కు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి ప్రముఖ దర్శక, నిర్మాతలందరితో సాన్నిహిత్యం ఉంది. సినీ రంగంలో తెర వెనుక జరిగిన ఎన్నో అనుభవాలను ఈ పుస్తకంలో క్రోడీకరించాడు’’ అన్నారు. పలువురు చిత్రరంగ ప్రముఖుల సహకారంతో ఈ పుస్తకాన్ని రాయగలిగానని ప్రమోద్‌కుమార్ చెప్పారు. ప్రమోద్ తనకు అన్నలాంటివారని, ఆయన పుస్తకం రచించడం ఆనందంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఇంకా పలువురు చిత్రరంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి
-
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: ప్రమోద్‌కుమార్
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆసుపత్రి నుంచి గత రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖురేషి భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషి ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు. ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి వారంత పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో నలుగురు పరారిలో ఉన్నారన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకోవడానికి తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశామన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
మాన్వీ కోసం మూసీలో గాలింపు చర్యలు
-
మాన్వీ కోసం మూసీలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
మూసీ నదిలో చిన్నారి మాన్వీ గల్లంతైన సంఘటన నగర ప్రజలను విషాదంలోకి నెట్టింది. లండన్ కు చెందిన వైద్యుడు ప్రమోద్ కుమార్ రెడ్డి కుమారుడికి మూసీ గురించి వివరిస్తుండగా భుజాన ఉన్న మాన్వీ వంతెన పైనుంచి నదిలోకి పడిపోయిన సంగతి తెలిసిందే. విషాద సంఘటన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మాన్వీ మృత దేహాన్ని గాలించేందుకు ట్యాంక్‌బండ్ వద్ద విధులు నిర్వర్తించే గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గురువారం గాలింపు చేపట్టారు. ఎల్బీనగర్ పోలీసులు, జీహెచ్ ఎంసీ అధికారులతోపాటు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గురువారం చీకటి పడే సరికి గాలింపు కార్యక్రమాలను ఆపి వేశారు. శుక్రవారం ఉదయమే మాన్వీ కోసం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. లండన్ లో వైద్యుడిగా సేవలందిస్తున్న ప్రమోద్ కుమార్ కుటుంబం సెలవుల్ని గడిపేందుకు గతనెల 15న ఎల్బీనగర్ లోని సహారా ఎస్టేట్‌కు వచ్చారు. ఈ నెల 26న లండన్‌కు తిరుగు ప్రయాణం కావలసిన ఉంది.