మూసీ నదిలో చిన్నారి మాన్వీ గల్లంతైన సంఘటన నగర ప్రజలను విషాదంలోకి నెట్టింది. లండన్ కు చెందిన వైద్యుడు ప్రమోద్ కుమార్ రెడ్డి కుమారుడికి మూసీ గురించి వివరిస్తుండగా భుజాన ఉన్న మాన్వీ వంతెన పైనుంచి నదిలోకి పడిపోయిన సంగతి తెలిసిందే. విషాద సంఘటన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మాన్వీ మృత దేహాన్ని గాలించేందుకు ట్యాంక్‌బండ్ వద్ద విధులు నిర్వర్తించే గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గురువారం గాలింపు చేపట్టారు. ఎల్బీనగర్ పోలీసులు, జీహెచ్ ఎంసీ అధికారులతోపాటు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గురువారం చీకటి పడే సరికి గాలింపు కార్యక్రమాలను ఆపి వేశారు. శుక్రవారం ఉదయమే మాన్వీ కోసం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. లండన్ లో వైద్యుడిగా సేవలందిస్తున్న ప్రమోద్ కుమార్ కుటుంబం సెలవుల్ని గడిపేందుకు గతనెల 15న ఎల్బీనగర్ లోని సహారా ఎస్టేట్‌కు వచ్చారు. ఈ నెల 26న లండన్‌కు తిరుగు ప్రయాణం కావలసిన ఉంది.
Published Fri, Aug 16 2013 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement