![Young Man Deceased City Bus Accident at Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/4/pramod.jpg.webp?itok=h6KC9J5d)
మృతుడు ప్రమోద్‌కుమార్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): బెంగళూరు నగరంలో గుంతల రోడ్లు, బీఎంటీసీ (బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్) సర్వీసులు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడిపై బస్సు దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు... హాసన్ జిల్లా చెన్నరాయపట్టణకు చెందిన ప్రమోద్ కుమార్ (24) లగ్గేరిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని కామాక్షిపాళ్య రింగ్ రోడ్డు చౌడేశ్వరి నగర హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వస్తుండగా వాయువేగంతో వస్తున్న బీఎంటీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. కిందపడిన ప్రమోద్‌పై దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ను హసిమ్ ఆసబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యశవంతపుర–బనశంకరిల మధ్య సంచరించే బస్‌లోని ప్రయాణికులు ఘటన జరిగిన సమయంలో డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు.
చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment