
యశవంతపుర(బెంగళూరు): కారు ఢీకొని ఫుడ్ డెలివరి బాయ్ మృతి చెందిన ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడిని మైసూరు జిల్లా హెచ్‌డీ కోటె తాలూకాకు చెందిన ప్రసన్నకుమార్ (25)గా గుర్తించారు. ప్రసన్న ఆదివారం అర్ధరాత్రి వరకు ఓ సంస్థలో క్యాషియర్‌గా పనిచేసి , తెల్లవారుజామున ఫుడ్ డెలివరీకి బయలుదేరాడు.
ఫుడ్ ఇవ్వడానికి బైక్‌పై మైసూరు రోడ్డులో వెళ్తుండగా వాయు వేగంతో వచ్చిన ఓ కారు ప్రసన్నను బలంగా ఢీకొంది. దాదాపు వంద మీటర్ల వరకు బైక్‌ను కారు లాక్కెళ్లడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పారిపోతుండగా ఆర్‌ఆర్‌నగర మెట్రో స్టేషన్ వద్ద స్థానికులు అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారును నడుపుతున్న వినాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment