సెక్స్ రాకెట్ లో సినిమా తారలు! | Sex Racket Involving Models, Actresses Busted In Panaji | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!

Published Fri, Jun 10 2016 6:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!

సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!

పణజి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును గోవా పోలీసులు రట్టు చేశారు. మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పణజి శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు.

'ఆనంద్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలు లభించాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయ'ని ఎస్పీ కశ్యప్ చెప్పారు. క్లైయింట్ల లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement