తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 'గరుడ్' కమాండర్ ప్రశాంత్ అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. అలప్పుజ పట్టణంలో ఓ ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో వారంతా ఇంటిపై కప్పుకు చేరుకున్నారు. అందులో ఓ బాలుడిని కమాండర్ ప్రశాంత్ హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో పై కప్పుకు చేరుకుని ఓ చేత్తో బాలుడిని, మరో చేత్తో తాడును పట్టుకొని సాహసంతో హెలికాప్టర్‌లోకి చేరుకున్నారు. కాగా బాలుడిని కాపాడిన కమాండర్‌కు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన రియల్ హీరో, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు ప్రశాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment