అపర్ణా రామభద్రన్(ఫైల్)
తిరువనంతపురం: భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఇవ్వచూపిన ఉద్యోగాన్ని మహిళా అథ్లెట్ అపర్ణా రామభద్రన్ తల్లి గీత తిరస్కరించారు. తనకు ఉద్యోగం అవసరం లేదని, న్యాయం కావాలని అన్నారు. కేరళలోని అళెప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌లో అపర్ణా రామభద్రన్, మరో ముగ్గురు అథ్లెట్లు విషపూరిత పండు (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఆత్మహత్యాయత్నం చేయగా అపర్ణ ప్రాణాలు కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఆమె తల్లి గీతకు ఉద్యోగం ఇచ్చేందుకు సాయ్ ముందుకు వచ్చింది. అయితే తనకు ఉద్యోగం వద్దని, న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేసింది. ఇద్దరు సీనియర్లు తనను వేధింపులకు గురి చేశారని ఆస్పత్రిలో అపర్ణ తనతో చెప్పిందని గీత విలేకరులతో చెప్పారు. నిందితులను కాపాడేందుకు సాయ్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.